Manchu Vishnu: తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు టాలీవుడ్ పూర్తిగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇలాంటి కష్టకాలం తెలుగు సినిమాకి ఎప్పుడూ రాలేదు, ఈ పరిణామాలను తెలుగు సినిమా ఎన్నడూ ఎదుర్కోలేదు. కానీ, జగన్ రూపంలో వచ్చిన ఈ అతి పెద్ద సమస్యకు పరిష్కారం మాత్రం ఇప్పట్లో కనబడట్లేదు. జగన్ ప్రభుత్వం పోతే గానీ, ఈ సమస్య తీరదు అని సినిమా వాళ్ళల్లో ఓ బలమైన అభిప్రాయం వచ్చేసింది.

ఇలా అయితే ఎలా ? అని కనీసం ఏ స్టార్ హీరో ముందుకు రావడం లేదు. సరే.. ఎవరి భయాలు వాళ్ళవి. కానీ మంచు ఫ్యామిలీకి జగన్ కి మధ్య చుట్టరికం ఉంది. పైగా జగన్ తనకు బావ అంటూ మంచు విష్ణు గొప్పలు పోయిన సందర్భాలు అనేకం. మరి ఇప్పుడు తెలుగు సినిమాకి జగన్ చేస్తున్న అన్యాయం మంచు విష్ణుకి కనిపించలేదా ? లేక, ఇలాగే జరగాలి అని మంచు విష్ణు బావిస్తున్నాడా ?
”సినిమా ఇండస్ట్రీ కొంత మంది చేతిలో నలిగిపోతుందని’, అందుకే తాను ఇక సినిమాల్లో నటించను అని గతంలో మంచు మనోజ్ ఆవేశంగా అరిసి మరి చెప్పాడు. మంచు మనోజ్ సినిమాకు అప్పుడు థియేటర్ల సమస్య వచ్చింది. అందుకే, మనోజ్ అప్పట్లో అలా రియాక్ట్ అయ్యాడు. అయితే, ఇప్పుడు థియేటర్స్ ను గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళంతా కష్టాల్లో చిక్కుకున్నారు.
Also Read: ఆ రెండు సినిమాలు స్టోరీ తెలియకుండానే చేశా: రామ్ చరణ్
కాబట్టి, వాళ్ళు థియేటర్స్ ను వదిలించుకోవడానికి సిద్ధపడ్డారు. మంచు ఫ్యామిలీకి కావాల్సింది ఇదేనా ? తమ సినిమాలకు కూడా థియేటర్స్ లేకుండా చేసిన వారి పై మంచు విష్ణు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడా ? ఈ థియేటర్స్ వ్యవహారంలో మంచు విష్ణు సలహాలు సూచనలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మంచు విష్ణు సలహా మేరకే.. జగన్ తన అధికారం అనే ఆయుధంతో థియేటర్స్ పై అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే.. పెదరాయుడుగా ప్రకటించుకున్న మంచు ఫ్యామిలీ పెద్ద ఇలా మౌనం పాటించడం మంచి పద్దతి కాదు. సినిమా ఇండస్ట్రీకి కీడు జరుగుతుంటే.. మంచు ఫ్యామిలీ అడ్రస్ కూడా లేదనట్టు పక్కకి వెళ్లిపోవడం కచ్చితంగా తప్పే.
Also Read: అభిమానులకు షాక్ ఇచ్చిన పాప్ సింగర్ అరియానా … ఏం చేసిందంటే ?