Homeఎంటర్టైన్మెంట్August 2026 Movies: ఆగస్టు నెలలో రాబోతున్న సినిమాలు ఇవే... సూర్య పై చేయి సాధిస్తాడా...

August 2026 Movies: ఆగస్టు నెలలో రాబోతున్న సినిమాలు ఇవే… సూర్య పై చేయి సాధిస్తాడా…

August 2026 Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం స్టార్ట్ అయి 7 నెలలు గడిచిపోయినప్పటికి కొంతమంది స్టార్ హీరోలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేశారు. వాళ్ళు చేసిన సినిమాల్లో కొందరు సక్సెస్ లను సాధిస్తే మరికొందరు అపజయాలను మూటగట్టుకున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ లో జనవరి నెల అనేది ప్రతి సంవత్సరం చాలా కీలకంగా మారుతుంది. సంక్రాంతి […]

August 2026 Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం స్టార్ట్ అయి 7 నెలలు గడిచిపోయినప్పటికి కొంతమంది స్టార్ హీరోలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేశారు. వాళ్ళు చేసిన సినిమాల్లో కొందరు సక్సెస్ లను సాధిస్తే మరికొందరు అపజయాలను మూటగట్టుకున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ లో జనవరి నెల అనేది ప్రతి సంవత్సరం చాలా కీలకంగా మారుతుంది. సంక్రాంతి సీజన్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. ఇక ఆగస్టు నెలలో సైతం మంచి సినిమాలు రిలీజ్ అవుతు ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేస్తుంటాయి. ఇక ఈ క్రమంలోనే ఈ ఆగస్టు నెలలో సూర్య హీరోగా వస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఇక రవితేజ హీరోగా చేసిన ‘ఇరుముడి’ సినిమాని సైతం 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ మరోసారి సూపర్ సక్సెస్ ను సాధించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక 26వ తేదీన హీరోగా యాడ్ హీరోగా చేసిన ‘టాక్సిక్’ సినిమా రాబోతుంది. 28వ తేదీన శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది. వెంకీ అట్లూరి గతంలో రెండు వరుస సక్సెస్ లను సాధించి మంచి ఊపు మీదున్నాడు. కాబట్టి అతను సూర్య తో చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.

గతంలో చేసిన ‘లక్కీ భాస్కర్’ సినిమా చాలా సింపుల్ గా వచ్చి సూపర్ సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా కూడా అదే బాటలో ఉండబోతుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం… ఆగస్టు నెలలో సక్సెస్ ను సాధించే హీరోల లిస్టులో సూర్య నిలుస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper