Irumudi Movie: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ టికెట్ల కోసం యుద్ధం జరుగుతోంది. సాధారణంగా ఎంత పెద్ద పాన్ ఇండియన్ సినిమాకు అయినా, కేవలం వీకెండ్స్ లోనే హౌస్ ఫుల్స్ నమోదు అవుతుంటాయి. వర్కింగ్ డేస్ లో హౌస్ ఫుల్స్ అవ్వడం దాదాపుగా అసాధ్యమే. అలాంటిది ‘ఇరుముడి’ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా సెన్సేషనల్ ఆక్యుపెన్సీలు నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూస్తే , ఆ బుకింగ్స్ ని చూసి కళ్ళు తిరగక తప్పదు. కేవలం సంక్రాంతి సీజన్ లో మాత్రమే కనపడే దృశ్యాలు అవి. అలాంటిది ఈ చిత్రానికి నేడు కూడా అదే తరహా బుకింగ్స్ నడుస్తున్నాయంటే , ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ ఒక అంచనా కి రాలేకపోతున్నారు.
ట్రేడ్ విశ్లేషకుల గణాంకాల ప్రకారం చూస్తే ఈ సినిమాకు బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి 4 రోజుల్లో 38 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి అట. పెద్ద పెద్ద పాన్ ఇండియన్ హీరోలకు కూడా ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోలేదు. ఇక 4వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అట. ప్రాంతాల వారీగా, ఈ చిత్రానికి 4 రోజుల్లో వచ్చినటువంటి వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 21 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 6 కోట్ల 26 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర నుండి 4 కోట్ల 4 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి నుండి 3 కోట్ల 14 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 85 లక్షలు, గుంటూరు నుండి 2 కోట్ల 89 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 2 కోట్ల 51 లక్షలు , నెల్లూరు నుండి 1 కోటి 38 లక్షలు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 43 కోట్ల 35 లక్షల షేర్ వసూళ్లు, 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 85 లక్షలు , ఓవర్సీస్ నుండి 6 కోట్ల 60 లక్షలు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 53 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 93 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల రూపాయలకు జరగ్గా , కేవలం 4 రోజుల్లోనే 32 కోట్ల 80 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి.