Telugu Cinema Industry Crisis: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కారణం ఏంటి అంటే స్టార్ హీరోలు ఇష్టం వచ్చినట్టుగా రెమ్యూనరేషన్ లను తీసుకొని భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు. దానివల్ల ప్రేక్షకులు ఆయన సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక ప్రేక్షకుల యొక్క అభిరుచిని క్యాష్ చేసుకుంటున్నా ప్రొడ్యూసర్లు టికెట్ల రేట్లను అమితంగా పెంచేస్తున్నారు. దానివల్ల స్టార్ హీరోల సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్న జనాలు ఫ్యామిలీతో పాటు ఆ సినిమాను చూస్తున్నారు. వాళ్ల ఫ్యామిలీతో ఆ సినిమాలు చూడడానికి దాదాపు 8 నుంచి 10 వేల రూపాయలైతే ఖర్చు చేస్తున్నారు. దీని వల్ల వారు తరచుగా సినిమాలను చూడడానికి ఇష్టపడడం లేదు. చిన్న సినిమాలను లేదా టాక్ బాగున్న సినిమాలు మాత్రమే థియేటర్ కి వచ్చి చూస్తున్నారు. మరి కొంతమంది చిన్న సినిమాలను ఓటిటి లో చూడ్డానికి ఇష్టపడుతున్నారు. ఒకరకంగా స్టార్ హీరోల వల్లే చిన్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం లేదనేది వాస్తవం…ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఈ పరిస్థితి మారాలి.. దానికి స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మారాల్సిన అవసరమైతే ఉంది. ఇక రీసెంట్ గా రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా భారీ కలెక్షన్స్ ను మాత్రం సాధించలేకపోయింది.
ఇక రీసెంట్ గా సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్ చూస్తే మాత్రం అంత పెద్దగా రావడం లేదు. ఎందుకని ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనే ధోరణిలో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆలోచిస్తున్నారు. ఇక స్టార్ హీరోలు మారాల్సిన అవసరమైతే ఉంది.
వాళ్ళు మారకపోతే మాత్రం చిన్న సినిమాలు చిన్న ప్రొడ్యూసర్లు భారీగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి స్టార్ హీరోల వల్ల సినిమా ఇండస్ట్రీ ముందుకు సాగడం లేదు. ఎందుకంటే వాళ్లు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు.
చిన్న సినిమా ప్రొడ్యూసర్లు మాత్రమే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చిన్న సినిమాలు వారానికి ఒకటి రెండు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఏదైనా ఒకటి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా ఇండస్ట్రీకి లాభాలైతే వస్తున్నాయి. కాబట్టి చిన్న సినిమాను బతికించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది…