Homeఎంటర్టైన్మెంట్Govinda family Values Inspirational Story: తల్లి పాదాలు కడిగి..ఆ నీళ్లు తాగిన సూపర్ స్టార్..ఈ...

Govinda family Values Inspirational Story: తల్లి పాదాలు కడిగి..ఆ నీళ్లు తాగిన సూపర్ స్టార్..ఈ కాలంలో కూడా ఇలాంటోళ్ళు ఉన్నారా?

Govinda family Values Inspirational Story:  జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోకూడదు. గుడికి వెళ్లి దేవుడిని మొక్కడం కాదు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే నీకు దేవుళ్ళు, ఇది గుర్తించిన ప్రతీ ఒక్కరు జీవితం లో ఉన్నత స్థాయికి వస్తారు. కానీ కొంతమంది దుర్మార్గులు ఆస్తుల కోసం తల్లిదండ్రులను కొట్టడం, చంపడం వంటివి ఈమధ్య కాలంలో చాలా సంఘటనలే చూశాము. మరికొంత మంది అయితే పెళ్ళాం పిల్లలు వచ్చిన తర్వాత, వాళ్ళే లోకం లాగా భావిస్తారు, తల్లిదండ్రులు వాళ్లకు […]

Govinda family Values Inspirational Story:  జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోకూడదు. గుడికి వెళ్లి దేవుడిని మొక్కడం కాదు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే నీకు దేవుళ్ళు, ఇది గుర్తించిన ప్రతీ ఒక్కరు జీవితం లో ఉన్నత స్థాయికి వస్తారు. కానీ కొంతమంది దుర్మార్గులు ఆస్తుల కోసం తల్లిదండ్రులను కొట్టడం, చంపడం వంటివి ఈమధ్య కాలంలో చాలా సంఘటనలే చూశాము. మరికొంత మంది అయితే పెళ్ళాం పిల్లలు వచ్చిన తర్వాత, వాళ్ళే లోకం లాగా భావిస్తారు, తల్లిదండ్రులు వాళ్లకు భారం అయిపోతుంది, తీసుకెళ్లి వృద్దాశ్రమం లో పడేస్తుంటారు. అలాంటి మనుషులు ఉన్న ఈరోజుల్లో కూడా తల్లిదండ్రులను దేవుళ్లుగా కొలిచే మహానుభావులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. వారిలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గోవిందా కూడా ఉన్నాడు. ఈయన మంచి తనం గురించి బాలీవుడ్ లో కథలు కథలు గా చెప్తుంటారు. రీసెంట్ గా మేనల్లుడు వినయ్ ఆనంద్ గోవిందా గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘మా అమ్మమ్మ నిర్మల గారి ప్రతీ పుట్టినరోజు కి, గోవిందా మామయ్య ఆమె కాళ్ళు కడిగి, నమస్కరించి, ఆ నీళ్లు తాగేవాడు. తన తల్లిని ఆయన దేవత గా చూసుకుంటాడు. మాకు కూడా ఆయన అదే నేర్పించాడు. ఈరోజు మేమంతా పెద్దలకు ఇంత గౌరవం ఇస్తూ ముందుకు సాగుతున్నాం అంటే అందుకు కారణం మా మామయ్యనే. మేమే కాదు ఇండస్ట్రీ లో అనేక మంది మామయ్య లైఫ్ స్టైల్ నచ్చి, ఆయన్ని అనుసరించేవారు.’ అంటూ వినయ్ ఆనంద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. 1986 వ సంవత్సరం లో ‘లవ్ 86’ అనే చిత్రం ద్వారా గోవిందా వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కామెడీ, యాక్షన్ , ఫ్యామిలీ డ్రామా అంటూ ఎన్నో వందల సినిమాలు చేసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా నిలిచాడు.

ముఖ్యంగా గోవిందా డ్యాన్స్ అప్పట్లో ఒక సెన్సేషన్. కేవలం ఆయన డ్యాన్స్ ని థియేటర్స్ లో చూడడం కోసం జనాలు క్యూలు కట్టేవారు. మన టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎలాగో, బాలీవుడ్ కి గోవిందా అలాగా. ఆరోజుల్లో ఇండియా మొత్తం మీద అద్భుతమైన డ్యాన్స్ వేసే హీరోలు వీళ్ళే. 2019 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన గోవిందా, ఆ తర్వాత వెండితెర కి దూరమై, రాజకీయాల్లో బిజీ అయ్యాడు. 2004 సంవత్సరం నుండే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లో చేరిన గోవిందా లోక్ సభ కి కూడా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన గోవిందా, 2024 వ శివ సేన పార్టీ లో చేరాడు. ఇక రాబోయే రోజుల్లో ఆయన్ని రాజకీయంగా ఏ స్థానంలో చూడబోతున్నాము అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper