Homeవింతలు-విశేషాలుMale Infertility: అవి వాడితే పురుషుల్లో సంతాన లేమి? ఇది ఎంతవరకు నిజం?

Male Infertility: అవి వాడితే పురుషుల్లో సంతాన లేమి? ఇది ఎంతవరకు నిజం?

Male Infertility: ఇప్పటి కాలంలో పురుషుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వెలుగు చూస్తున్నాయి. అందులో ప్రధానమైనది సంతాన లేమి. చదువు.. కెరియర్.. ఉద్యోగం.. వంటి వాటి చుట్టూ పరిభ్రమిస్తుండడంతో చాలామంది పురుషులు సరైన వయసులో పెళ్లి చేసుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాలలో అమ్మాయిలు దొరకకపోవడంతో బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు.

కొందరు అతి కష్టం మీద పెళ్లి చేసుకున్నప్పటికీ.. కొన్ని సందర్భాలలో పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తున్నారు. ఇదే క్రమంలో వారు రకరకాల విధానాలను పాటిస్తున్నారు. పిల్లలు వద్దు అనుకున్నప్పుడు కలయికలో పాల్గొనే భాగస్వాములు “సేఫ్టీ” విధానాన్ని పాటిస్తారు. ముఖ్యంగా పురుషులు ” సేఫ్టీ” ధరించి కలయికలో పాల్గొంటారు. వాస్తవానికి
“సేఫ్టీ” అనేది గతంలో ఒకే విధానంలో ఉండేది. అయితే ఇప్పుడు రకరకాల రూపాలలో.. రకరకాల ఫ్లేవర్లలో లభిస్తోంది.

సేఫ్టీ వాడే పురుషుల్లో సంతానలేమి ఉంటుందని ఇటీవల కాలంలో ప్రచారం మొదలైంది. దీనికి సోషల్ మీడియా కూడా తోడు కావడంతో ఆ ప్రచారం తారస్థాయికి చేరింది. దీంతో చాలామంది పురుషుల్లో సేఫ్టీ వాడితే సంతాన లేమి సమస్య వస్తుందని భయం మొదలైంది. అయితే అదంతా నిజం కాదని.. కేవలం అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. సేఫ్టీ పడినప్పుడు స్త్రీ గర్భాశయంలోకి పురుషుడి వీర్యం వెళ్ళదని.. దానిని గర్భాశయంలోకి వెళ్లకుండా సేఫ్టీ అడ్డుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.

సేఫ్టీ వాడటం వల్ల పురుషుల హార్మోన్లపై ఎటువంటి ప్రభావం పడదని.. వీర్యం నాణ్యత పై ఎటువంటి ఎఫెక్ట్ చూపదని వైద్యులు చెబుతున్నారు. పైగా లైంగిక వ్యాధుల నుంచి సేఫ్టీ రక్షణ కల్పిస్తుందని.. పరోక్షంగా సంతాన సామర్థ్యాన్ని పెంపొందించే ఆరోగ్యాన్ని కాపాడుతుందని వైద్యులు అంటున్నారు. సంతాన ఉత్పత్తికి.. సేఫ్టీ వాడటానికి.. మధ్య ఎటువంటి సంబంధం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

సేఫ్టీని అత్యంత జాగ్రత్తగా తయారు చేస్తారు. ఇందులో వాడే కెమికల్స్ పురుషత్వానికి ఎటువంటి హాని చేయవు. పైగా వీటి తయారీలో ఇప్పుడు కంపెనీలు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. అలాంటప్పుడు సేఫ్టీలు పురుషుల అంతర్గత ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని నిజమని నమ్మితే ఇబ్బంది పడక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని అసలు నమ్మకూడదని పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular