Poco M8 Power 5G మార్కెట్లోకి ఎన్ని మొబైల్స్ వచ్చినా మిడ్ రేంజ్ వాటికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీలు తక్కువ ధర ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తుంటారు. ఇందులో భాగంగా పోకో కంపెనీ నుంచి కొత్త ఫోన్ ను రిలీజ్ చేశారు. ఈ మొబైల్ బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలుపుతోంది. అలాగే ఆకర్షణీయమైన డిజైన్ దీని సొంతం అన్నట్లుగా ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
పోకో నుంచి M8 Power 5G అనే ఫోన్ ఆగస్టు 4 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఏమోల్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండడంతో స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. దీంతో గేమ్స్ ఆడేవారితో పాటు వీడియోలు చూసేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 అనే చిప్‌సెట్‌ను అమర్చారు.
ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఫోన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 50 మెగా పిక్సెల్ తో కూడిన ప్రాథమిక రియర్ కెమెరా అందుబాటులో ఉండనుంది. ఇది స్పష్టమైన లైటింగ్‌తో పాటు నైట్ మోడ్‌లో కూడా నాణ్యమైన ఫోటోలను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ లో 8 ఎంపీ కెమెరాను అందించారు. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ను అందుబాటులో ఉంచారు.
ఈ కొత్త ఫోన్ లో ఏకంగా 8000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉంచారు. సాధారణ వాడకంలో ఒకే ఛార్జ్‌పై ఏకంగా రెండు నుంచి మూడు రోజుల పాటు పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45 వాట్ ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీనితో పాటు ఇతర చిన్న గ్యాడ్జెట్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ఇందులో 22.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అందించడం విశేషం.ఈ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలంటే ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగష్టు 07 నుంచి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు నో-కాస్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉండే అవకాశముంది. 6 జీబీర్యామ్ తో పాటు 128జీబీ వేరియంట్ కలిగిన ఫోన్ రూ.21,999తో విక్రయిస్తున్నారు. టాప్ వేరియంట్ ధర మారొచ్చు.