Homeఎంటర్టైన్మెంట్Lenin Movie Closing Collections: 'లెనిన్' మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. అక్కినేని ఫ్యాన్స్...

Lenin Movie Closing Collections: ‘లెనిన్’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. అక్కినేని ఫ్యాన్స్ కోరిక అలాగే మిగిలిపోయింది..

Lenin Movie Closing Collections: అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 12 ఏళ్లకు అఖిల్ తన కేరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకునేలోపు అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఇక పై అఖిల్ […]

Lenin Movie Closing Collections: అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 12 ఏళ్లకు అఖిల్ తన కేరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకునేలోపు అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఇక పై అఖిల్ కెరీర్ లో అన్ని బ్లాక్ బస్టర్స్ మాత్రమే ఉంటాయని, కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే , కచ్చితంగా ఆయన స్టార్ హీరోల లీగ్ లోకి చేరుతాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే కొత్త సినిమాల రాకతో ‘లెనిన్’ థియేట్రికల్ రన్ ఆగిపోయింది. ఈ నెల 7 న ఈ చిత్రాన్ని జీ 5 లో స్ట్రీమింగ్ కూడా చేయబోతున్నారు.

అయితే క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎలాంటి వసూళ్లు వచ్చాయో , ఒకసారి వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అవ్వగా, సీడెడ్ ప్రాంతం నుండి 4 కోట్లు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 4 కోట్ల 30 లక్షలు వచ్చాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , పశ్చిమ గోదావరి జిల్లా నుండి 1 కోటి 70 లక్షలు వచ్చాయి. అదే విధంగా గుంటూరు నుండి 2 కోట్ల 40 లక్షలు రాగా , కృష్ణ జిల్లా నుండి 1 కోటి 85 లక్షలు , నెల్లూరు నుండి 1 కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 54 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల షేర్ వసూళ్లు రాగా , ఓవర్సీస్ నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 39 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 74 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అఖిల్ కి ఇది చాలా మంచి వసూళ్లు , అదే విధంగా ఈ ఏడాది అత్యధిక లాభాలు రాబట్టిన టాప్ 4 చిత్రాల్లో ఒకటి ఇది. కానీ అక్కినేని ఫ్యాన్స్ కలగన్న 100 కోట్ల గ్రాస్ మార్కుని మాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper