Vishnupriya: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ పదం మళ్లీ ఎక్కువగా వింటున్నాం. అఫ్ కోర్స్ ఒకప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉండేది.. కానీ బయటపెట్టడానికి నాడు భయపడేవారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ధైర్యం చేసి మరి మమ్మల్ని పలానా డైరెక్టర్.. పలానా ప్రొడ్యూసర్ పక్కలోకి రమ్మన్నాడు ..వాళ్ల కోరికలు తీర్చమన్నారు అంటూ ధైర్యంగా పేర్లు కూడా చెబుతున్నారు. అలా చెప్పినా కానీ సినీ ఇండస్ట్రీలో న్యాయం జరుగుతుందన్న భరోసా మాత్రం లేదు. ఇప్పటికే అలా చెప్పిన హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా పక్కన పడిపోయారు..

Vishnu-Priya
బాంబు పేల్చిన బుల్లితెర యాంకర్..
రీసెంట్ గా బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ కూడా అదే లిస్టులోకి చేరింది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై కూడా అలాంటివి జరుగుతున్నాయని బాంబు పేల్చింది. విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ‘‘పోవే పోరా’’ అనే షోతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో హాట్ ఫొటో షూట్స్ చేస్తూ కొన్ని సినిమాల్లో కూడా నటించింది. నిజానికి అమ్మడు వెండి తెర కన్నా బుల్లితెరపైనే బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలు షేర్‌చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ‘‘జరీ జరీ’’ అంటూ సాగే ఓ వీడియో సాంగ్ కూడా చేసింది. ఆ సాంగ్‌లో విష్ణుప్రియ హాట్‌గా ఉందని కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రమోషన్ కోసం కోసం ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. విష్ణుప్రియ. ఇందులో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట సత్యం. అది అందరికీ తెలుసు. నన్ను కూడా సినిమా అవకాశాల పేరుతో వాడుకోవాలని చూశాడు ఓ బడా డైరెక్టర్. సినిమా అవకాశం ఇస్తాం అంటూ తన కెరియర్ మొదట్లో ఓ డైరెక్టర్ తనతో మిస్ బీహేవ్ చేయడానికి ట్రై చేశాడు’ అని పేర్కొంది. ‘సినిమాలో చాన్స్ ఇస్తాం మరి నా కోరిక తీరుస్తావా’ అంటూ డైరెక్టర్ డైరెక్ట్‌గా అడిగాడని తెలిపింది. కానీ తనకు అలాంటి చెత్త పనులు చేసి అవకాశాలు దక్కించుకునే కర్మ పట్టలేదని ఆయన ముఖాన చెప్పినట్లు తెలిపింది. దీంతో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు కొందరు నెటిజన్స్ ‘‘నిజంగానే విష్ణు ప్రియ డైరెక్టర్‌కు కమిట్మెంట్ ఇవ్వలేదా ..?’’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Dhanush Sir Movie: ‘సార్’ రాక అప్పుడే.. మరోవైపు ధనుష్ పై తమిళ నిర్మాతలు సీరియస్.. కారణం ఇదే !

అఖిల్‌తో ఒక్క ఛాన్స్ కోసం..
తనకు హీరో అక్కినేని అఖిల్ అంటే ఎంతో పిచ్చో ఇంటర్వ్యూలో చెప్పింది. అఖిల్‌తో ఒక్క ఛాన్స్ కావాలంటూ డైరెక్టర్లను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. తనకు అఖిల్‌తో జన్మజన్మల అనుబంధం ఉందని చెప్పింది. అఖిల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తాను ఓ మోస్తరు డ్యాన్సర్ అని.. అఖిల్‌తో డ్యాన్స్ చేసే ఒక్క అవకాశం ఇప్పించాలంటూ చేతులు జోడించి మరీ వేడుకుంటోందట. ఇదిలా ఉండగా విష్ణు ప్రియ యాంకర్ అయినప్పటికీ చాలా సార్లు ఇంటర్వ్యూలలో తాను అఖిల్ కు వీరాభిమాని అని చెబుతుంది. అంతే కాకుండా అఖిల్ సినిమాలు వచ్చినా కూడా బర్త్ డే వచ్చినా అతడి ఫోటోలను షేర్ చేస్తూ లవ్ చూపిస్తుంది. డైరెక్టర్లపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ.. మరోవైపు అఖిల్‌తో చాన్స్ కోసం వేడుకుంటున్న విష్ణుప్రియకు మరి డైరెక్టర్లు ఒక్క చాన్స్ ఇప్పిస్తారో లేదో చూడాలి మరి.
Also Read: Viral Love Story: 62ఏళ్ల వృద్ధుడి ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి