Siddharth: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకడు సిద్దార్థ్. శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో హీరో గా తెలుగు, తమిళ ఆడియన్స్ కి పరిచయమైనా ఈయన, ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సంచలనాత్మక చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆయన కెరీర్ లో హిట్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ, అవేమి కెరీర్ ని మలుపు తిప్పే రేంజ్ అయితే కాదు. తెలుగు లో మంచి స్టార్ స్టేటస్ వచ్చిన సమయంలో రెండు మూడు వరుస ఫ్లాప్స్ వచ్చేలోపు, మన టాలీవుడ్ ని వదిలి కోలీవుడ్ కి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఈయన హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కేవలం కోలీవుడ్ కి మాత్రమే ఈయన పరిమితం కాలేదు, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసాడు. ‘రంగ్ దే బసంతి’ లాంటి సంచలనాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషించే అదృష్టం ఈయనకి దక్కింది.
ఇకపోతే ఈ ఏడాది ఈయన శంకర్ తెరకెక్కించిన ‘ఇండియన్ 2’ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కంటే ఈ సినిమాలో సిద్దార్థ్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది కానీ, సినిమా శంకర్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ చిత్రానికి ముందు ఆయన నటిస్తూ, నిర్మాతగా వ్యవహరించిన ‘చిన్నా’ చిత్రం కమర్షియల్ గా మంచి సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా, సిద్దార్థ్ కి మంచి పేరుని కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన ‘మిస్ యూ’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే సిద్దార్థ్ ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరీ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
బంధు మిత్రుల సమక్ష్యం లో ఈ పెళ్లి ఒక పురాతన దేవాలయం లో జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను మనం సోషల్ మీడియా లో చాలానే చూసాము. అయితే సిద్దార్థ్ కి ఇంతకు ముందు, 2003 వ సంవత్సరం లో మేఘన అనే అమ్మాయితో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన కొన్నాళ్ళకు సిద్దార్థ్ ‘రంగ్ దే బసంతి’ మూవీ షూటింగ్ చేసాడు. షూటింగ్ సమయంలో ఆయన హీరోయిన్ సోహా అలీ ఖాన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ కారణంగా సిద్దార్థ్, మేఘన మధ్య విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. 2006 వ సంవత్సరం లో ఈ దంపతులిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకోగా, 2007 వ సంవత్సరంలో విడాకులు మంజూరు అయ్యింది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. మొదటి భార్య, కొడుకు కలిసి ఉన్న ఒక ఫోటోని మీ కోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాం చూడండి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Have you ever seen the son of hero siddharth first wife
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com