spot_img
Homeఎంటర్టైన్మెంట్పవన్ కోసం హరీష్ పోరాటాల హంగులు !

పవన్ కోసం హరీష్ పోరాటాల హంగులు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కొన్ని కథలు బాగా సెట్ అవుతాయి. ముఖ్యంగా సమాజం పై పోరాడే వీరుని పాత్ర పవన్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. వకీల్ సాబ్ లో కేవలం లాయర్ గా కనిపిస్తేనే ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ సినిమాలో మహా అయితే పవన్ నాలుగైదు పవర్ ఫుల్ డైలాగులు పలికి ఉంటాడు. ఆ మాత్రానికే ఆ సినిమా పై అభిమానులు కలెక్షన్స్ సునామీ కురిపించారు.

ఇవ్వన్నీ గమనించాడు కాబట్టే.. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్, పవన్ తో చేయబోతున్న సినిమాలో సమాజ సేవకు సంబంధించిన అదనపు హంగులు అన్నీ తన కథకి అద్దేసే పనిలో పడ్డాడు. వకీల్ సాబ్ కు ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసినట్టుగానే.. తన సినిమాలో కూడా ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ను రాసాడు హరీష్ శంకర్.

ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ రైతుబిడ్డగా రైతు నాయకుడిగా కనిపిస్తాడట. ఇక రైతు నాయకుడు అంటే.. అందరికీ మ్యాటర్ అర్థమైయే ఉంటుంది, వ్యవసాయంలో నష్టపోయి జీవితాలను నష్టపోతున్న వారికీ పవన్ తన శైలిలో సాయం అందిస్తాడు. అలాగే ఆపదలో వున్నవారిని ఆదుకుంటాడు. అయితే సీన్స్ వెరీ రెగ్యులర్ గా ఉన్న, సీన్స్ ను తెరెకెక్కించే విధానం మాత్రం హరీష్ చాల కొత్తగా ప్లాన్ చేశాడట.

మొత్తానికి హరీష్ శంకర్ ఇలా అన్ని హీరోయిజం ఎలిమెంట్స్ ను తన స్క్రిప్ట్ లో యాడ్ చేసుకుని.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ చిత్రాన్ని తీయాలని గట్టిగా ప్లాన్ చేశాడు. ఇక హరీష్ శంకర్ అంటేనే బోల్డ్. గ్లామరస్ హీరోయిన్, అలాగే డ్యూయట్ సాంగ్స్, రొమాన్స్ లాంటి అంశాలు పుష్కలంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాడు.

మరి హరీష్ ఈ సినిమాతో పవన్ పూర్వ మాస్ వైభవాన్ని తెలుగు తెరకు మరోసారి ఘనంగా చాటి చెప్పడం ఖాయం. మొత్తానికి చూస్తుంటే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో కాస్త గట్టిగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper