Happy Re Release Viral Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ లో 2006 వ సంవత్సరం నుండే విపరీతమైన క్రేజ్ ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏడాది జనవరి 27 న ఆయన నుండి విడుదలైన ‘హ్యాపీ’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ తెలుగు లో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇదే చిత్రాన్ని మలయాళం లో డబ్ చేసి విడుదల చేశారు. అక్కడ ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మోహన్ లాల్ , మమ్మూటీ సినిమాలతో సమానంగా కలెక్షన్స్ ని రాబడుతూ , అత్యధిక సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుండే అల్లు అర్జున్ కి కేరళ లో కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ ప్రతీ సినిమా మలయాళం లో డబ్ అయ్యేవి.
‘వరుడు’ లాంటి చిత్రం కూడా అక్కడ డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, కేరళ జనాలు అల్లు అర్జున్ ని ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారు అనేది. అయితే ‘హ్యాపీ’ చిత్రాన్ని రీసెంట్ గానే మలయాళం లో 4K క్వాలిటీ కి మార్చి రీ రిలీజ్ చేశారు. అక్కడ ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , మూడు రోజుల్లో దాదాపుగా కోటి రూపాయిల గ్రాస్ ని రాబట్టి చరిత్ర సృష్టించింది. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన స్టార్ హీరోల కొత్త సినిమాలు ‘పెద్ది’, ‘ది రాజా సాబ్’ లను మించి ఈ చిత్రం వసూళ్లను రాబడుతుంది అంటే , కేరళ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఎలాంటి కల్ట్ స్టేటస్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ సినిమా థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి కూతురు , తన స్నేహితులతో కలిసి చిందులు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. చిరంజీవి కూతురు అంటే , సొంత కూతురు కాదండోయ్ , ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో ఒక గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్నాడు కదా?, రీసెంట్ గానే పొలాచ్చి లో 12 రోజుల పాటు ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకొని వచ్చారు. ఇందులో యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ చిరంజీవి కి కూతురు గా నటిస్తోంది. హ్యాపీ రీ రిలీజ్ థియేటర్ లో చిందులు వేసింది ఈమెనే. రీసెంట్ గా ఈమె ‘విత్ లవ్’ అనే చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజీ హీరోయిన్ ఇప్పుడు హ్యాపీ రీ రిలీజ్ థియేటర్ లో ఈ రేంజ్ లో చిందులు వేయడాన్ని చూసి అల్లు అర్జున్ అభిమానులు గర్వపడుతున్నారు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
View this post on Instagram

