Homeఎంటర్టైన్మెంట్Buchi Babu Mahesh Babu Film: మహేష్ బాబు తో మైథలాజికల్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన...

Buchi Babu Mahesh Babu Film: మహేష్ బాబు తో మైథలాజికల్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బుచ్చి బాబు.. వీడియో వైరల్..

Buchi Babu Mahesh Babu Film: తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ మేనియా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రోజుకి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ , తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 రోజుల్లోనే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. కరువులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఊపిరి ని ఇచ్చింది ఈ ‘పెద్ది’ చిత్రం. అయితే […]

Buchi Babu Mahesh Babu Film: తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ మేనియా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రోజుకి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ , తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 రోజుల్లోనే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. కరువులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఊపిరి ని ఇచ్చింది ఈ ‘పెద్ది’ చిత్రం. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు తన భుజాల పై ఈ చిత్రాన్ని మోశాడు , అద్భుతంగా నటించి, నేషనల్ అవార్డు కచ్చితంగా రామ్ చరణ్ కి ఇవ్వాల్సిందే అనే రేంజ్ పేరు తెచ్చుకున్నాడు. కానీ డైరెక్టర్ బుచ్చి బాబు మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదురుకున్నాడు.

ఎందుకంటే హీరోయిన్ ని ఆయన చూపించిన తీరుని ఆడియన్స్ ఏకిపారేశారు. ఒక సందేశాత్మక చిత్రం తీస్తూ , యువతని తప్పుదోవ పట్టించే ఇలాంటి పాత్రలను ఎలా డిజైన్ చెయ్యాలని అనిపించింది అంటూ ఆయన్ని నిలదీశారు నెటిజెన్స్. అంతే కాకుండా స్క్రీన్ ప్లే విషయం లో కూడా బుచ్చి బాబు చాలా తప్పులు చేసాడని, రామ్ చరణ్ నటన కారణంగా వాటిని ఆడియన్స్ క్షమించారని అంటూ కూడా విమర్శలు చేశారు. అయితే బుచ్చి బాబు తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో దాదాపుగా ఖరారు అయ్యింది అనే వార్తలు విని, సోషల్ మీడియా మహేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనికి నిన్ను హ్యాండిల్ చేసేంత సత్తా లేదని, చాలా మిడ్ డైరెక్టర్ అని , పెద్ది కేవలం రామ్ చరణ్ వల్ల ఆడుతుందని , దయచేసి అతనికి అవకాశం ఇవ్వొద్దు అంటూ మహేష్ ని ట్యాగ్ చేసి పోస్టులు పెట్టారు.

అయితే మహేష్ తో ఆయన ఎంచుకున్న జానర్ మైథాలజీ అని తెలియడం తో కాస్త శాంతించారు. నిన్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ లో ఒక రిపోర్టర్ బుచ్చి బాబు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మైథాలజీ చిత్రమని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి?’ అని అడగ్గా, అందుకు బుచ్చి బాబు సమాధానం చెప్తూ ‘ఏదైనా టైం నిర్ణయిస్తుంది సార్’ అని చెప్పుకొచ్చాడు. అంటే సోషల్ మీడియా లో ప్రచారమయ్యే వార్తల్లో నిజం ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు బుచ్చి బాబు. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper