Simbu: ఈమధ్య కాలంలో విభిన్నమైన క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్లు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఒకప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే భయపడే వాళ్ళు , కానీ ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ లో మార్పులు రావడం తో , రకరకాల పాత్రలు చేయడానికి సాహసం చేస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఆండ్రియా జరేమియా. ఒక సింగర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె , ఆ తర్వాత హీరోయిన్ గా మారి , ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఈమధ్య కాలం లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న ఆమె , ఇప్పుడు లేటెస్ట్ గా ‘అరసన్’ అనే చిత్రం లో విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వడా చెన్నై’ చిత్రానికి ఇది సీక్వెల్.
శింబు హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో ఆండ్రియా శింబు కి తల్లి పాత్రలో కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియా లో చాలా రోజుల నుండి ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై రీసెంట్ గానే ఆండ్రియా రెస్పాన్స్ ఇచ్చింది. ‘అరసన్ ‘ చిత్రం లో నేను నటిస్తున్న విషయం వాస్తవమే , కానీ శింబు కి తల్లి పాత్రలో నటిస్తున్నాను అంటూ ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది ఆండ్రియా. దీంతో సోషల్ మీడియా లో ఇంతకాలం జరుగుతూ వచ్చిన ప్రచారానికి చెక్ పడింది. ‘వడా చెన్నై’ లో తన పాత్రకు కొనసాగింపుగా ఈ చిత్రం లో ఉంటుందని చెప్పుకొచ్చింది ఆండ్రియా. గతం లో వీళ్లిద్దరు హీరో హీరోయిన్లు గా కలిసి రెండు సినిమాల్లో నటించారు. అవి ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ఇక ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.