Trisha Krishnan: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో త్రిష కృష్ణన్(Trisha Krishnan) పేరు కచ్చితంగా ఉంటుంది. ఈమెని మన చిన్నతనం లో హీరోయిన్ గా చూసాము. ఇప్పటికీ హీరోయిన్ గానే చూస్తున్నాము. అప్పట్లో ఎంత అందంగా ఉండేదో, ఇప్పటికీ అంతే అందంగా ఉంది. అప్పట్లో ఎలా అయితే స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలను సంపాదిస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్ళిందో, ఇప్పటికీ అదే స్థానం లో ఉంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ తో తప్ప సౌత్ లో ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరితో ఈమె సినిమాలు చేసేసింది. ఆన్ స్క్రీన్ మీద త్రిష ఏ హీరో తో కనిపించినా చాలా చక్కగా ఉంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అధర్ అనే లాగా అనిపిస్తుంది. ఒకప్పుడు సౌందర్య కి ఇలాంటి ఫీచర్ ఉండేది, ఆ తర్వాత త్రిష కి మాత్రమే ఈ ఫీచర్ ఉంది.
అయితే ఒకప్పుడు ఈమె రొమాన్స్ చేసిన హీరో కి ఇప్పుడు తల్లిగా నటిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. తమిళ హీరో శింబు(Silambarasan TR) తో ఈమె గతం లో మూడు సినిమాల్లో నటించింది. అందులో ‘విన్నైతాండి వరువాయా’ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన ‘ఏ మాయ చేసావే’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం లో శింబు త్రిష తో చేసిన రొమాన్స్ అప్పట్లో ఒక సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. అంతే కాదు ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ని చూసి, వీళ్ళు రిలేషన్ లో ఉన్నారంటూ ఇండస్ట్రీ లో పుకార్లు కూడా పుట్టాయి. అలాంటి ఈ జోడి భవిష్యత్తులో తల్లి కొడుకులుగా నటిస్తారని కలలో అయినా ఊహించారా..?, కానీ అదే జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కమల్ హాసన్(Kamal Hassan), మణిరత్నం(Maniratnam) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్'(Thug Life) వచ్చే నెల నాల్గవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో శింబు, త్రిష కూడా నటించారు. ఇందులో శింబు కమల్ హాసన్ కి కొడుకుగా నటించాడు. తండ్రి కొడుకుల మధ్య జరిగే క్లాష్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రకటించిన కొత్తల్లో ఇందులో త్రిష, శింబు నటిస్తున్నారంటే, వీళ్లిద్దరు జోడీగా కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ నిన్న ట్రైలర్ ని చూసిన తర్వాత త్రిష కమల్ హాసన్ కి జోడి గా నటిస్తుందని తెలుస్తుంది. కమల్ హాసన్ కి జోడి అంటే శింబు కి తల్లి అన్నట్టే కదా లెక్క. ఈ విషయం పై ఇప్పుడు సోషల్ మీడియా లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.