Homeఎంటర్టైన్మెంట్Samantha Pregnancy: ప్రెగ్నన్సీ వచ్చినా సమంత అసలు తగ్గడం లేదుగా.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు..

Samantha Pregnancy: ప్రెగ్నన్సీ వచ్చినా సమంత అసలు తగ్గడం లేదుగా.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు..

Samantha Pregnancy: ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ని పెళ్లాడిన తర్వాత సమంత కి గోల్డెన్ డేస్ ప్రారంభం అయ్యాయి అనే చెప్పొచ్చు. మయోసిటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం నుండి ట్రీట్మెంట్ తీసుకుంటూ , విశ్రాంతి మోడ్ లో ఉన్నటువంటి సమంత , రీసెంట్ గానే నిర్మాత గా ఎంట్రీ ఇస్తూ ‘శుభం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత మరోసారి ఆమె నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ప్రధాన పాత్ర పోషిస్తూ […]

Samantha Pregnancy: ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ని పెళ్లాడిన తర్వాత సమంత కి గోల్డెన్ డేస్ ప్రారంభం అయ్యాయి అనే చెప్పొచ్చు. మయోసిటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం నుండి ట్రీట్మెంట్ తీసుకుంటూ , విశ్రాంతి మోడ్ లో ఉన్నటువంటి సమంత , రీసెంట్ గానే నిర్మాత గా ఎంట్రీ ఇస్తూ ‘శుభం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత మరోసారి ఆమె నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ప్రధాన పాత్ర పోషిస్తూ చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ కూడా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి , ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఆమె గర్భం దాల్చింది. అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నది.

ఇలా రాజ్ తో పెళ్లి తర్వాత సమంత కి అన్నీ శుభాలే జరుగుతున్నాయి , మానసికంగా ఇది ఆమెకు పట్టరాని సంతోషాన్ని ఇస్తోంది. అయితే గర్భం దాల్చిన మహిళా ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అడుగు తీసి అడుగు పెట్టరాదు, అంత జాగ్రత్తగా ఉండాలి. కానీ సమంత మాత్రం అసలు తగ్గేదేలే అనే మూడ్ లో ముందుకు దూసుకెళ్తోంది. రీసెంట్ గానే బేబీ బంప్ తో జిమ్ లో వర్కౌట్స్ చేసిన సమంత , ఇప్పుడు ఫోటో షూట్ లో కూడా పాల్గొని అందరినీ షాక్ కి గురి చేసింది. పసుపు రంగు దుస్తులతో , ఆల్ట్రా స్టైలిష్ లుక్ తో సమంత దిగిన ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో సమంత బేబీ బంప్ తో ఉండడాన్ని మనం గమనించొచ్చు. సాధారణంగా ప్రెగ్నన్సీ వచ్చినప్పుడు స్త్రీల ముఖం లో మార్పులు కనిపిస్తాయి.

కానీ సమంత లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. అందుకు కారణం వర్కౌట్స్ చేయడం వల్లనే అట. డాక్టర్ల సూచనలు పాటిస్తూనే , చాలా జాగ్రత్తగా తన ఫిట్నెస్ ని కూడా చూసుకుంటుంది సమంత. ఇకపోతే ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత ఎలాంటి సినిమా చేయబోతుంది అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. సక్సెస్ మీట్ లో ప్రస్తుత మెటర్నటీ లీవ్ లో ఉన్నానని , ఇప్పట్లో సినిమా చేయకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. అంటే కనీసం ఏడాది పాటు సమంత ని వెండితెర పై చూసే అవకాశం లేదు అన్నమాట.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper