Homeఎంటర్టైన్మెంట్Rajamouli Success Secret: రాజమౌళి బలం ఏంటి... డీ కోడ్ చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్స్...

Rajamouli Success Secret: రాజమౌళి బలం ఏంటి… డీ కోడ్ చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్స్…

Rajamouli Success Secret: దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటిని మైంటైన్ చేస్తూ ఉంటాడు. ప్రతి సినిమాతో భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే ఆయనకు వరుస సక్సెసులైతే దక్కుతున్నాయి. తను పడే కష్టానికి సక్సెస్ లు కొలమానంగా మారుతున్నాయనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం వారణాసి సినిమాతో ప్రేక్షకులను మైమరిపింపజేయడానికి […]

Rajamouli Success Secret: దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటిని మైంటైన్ చేస్తూ ఉంటాడు. ప్రతి సినిమాతో భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే ఆయనకు వరుస సక్సెసులైతే దక్కుతున్నాయి. తను పడే కష్టానికి సక్సెస్ లు కొలమానంగా మారుతున్నాయనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం వారణాసి సినిమాతో ప్రేక్షకులను మైమరిపింపజేయడానికి సిద్ధమవుతున్న ఆయన వరుస సక్సెస్ లను సాధించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి రాజమౌళి ఒక కథను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ జానర్ కి తగ్గట్టుగా ఆయన తీవ్రంగా కష్టపడుతూ ఉంటాడు. ఒక్కో సన్నివేశాన్ని చెక్కుతూ ఉంటాడు. ప్రతి సీను ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి సినిమా గ్రాఫ్ ని పెంచుతూ ప్రేక్షకుడిలో ఒక ఎమోషన్ ని కలిగిస్తాడు.

ఇక అదే రేంజ్ లో హీరోకి ఎలివేషన్స్ ను ఇస్తూ ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఇక ప్రేక్షకుడి పల్స్ తెలిసిన దర్శకుడిగా తనకు మంచి గుర్తింపైతే ఉంది. ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా ఒకదానిని మించి ఒకటి సూపర్ సక్సెస్ లను సాధించడం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు… ఇక బాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…

డెడికేటెడ్ గా వర్క్ చేస్తే ఎవరైనా సరే సక్సెస్ ని సాధించొచ్చు అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు తప్ప ఆయనలా ఎవరు కష్టపడటం లేదు. అందువల్లే ఎవరికి వరుస సక్సెసులైతే రావడం లేదు. ఇక అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్న కూడా ఆయన ఒక టిపికల్ జానర్ లోనే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

విజువల్ వండర్స్ ని క్రియేట్ చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుడిని 100% సర్టిఫై చేయగలిగే దర్శకుడు రాజమౌళి ఒక్కడే అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper