spot_img
Homeజాతీయ వార్తలుకవితకు ఇప్పుడే నో ఛాన్స్‌?

కవితకు ఇప్పుడే నో ఛాన్స్‌?

No chance for Kalvakuntla kavitha into the KCR cabinet

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కూతురు కవిత. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ క్యాండిడేట్‌పై ఓటమి పాలయ్యింది. తర్వాత ఏడాదిన్నర పాటు రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. ఆమె పేరు కూడా వినిపించలేదు. ఇటీవల నిజామాబాద్‌ స్థానిక సంస్థల నుంచి ఆమె ఎమ్మెల్సీగా గెలుపొందారు.

Also Read: చంద్రబాబు సైడ్‌.. చినబాబుకే స్టీరింగ్..

ఈ ఎన్నికలో అన్ని పార్టీలూ బరిలోకి దిగిన.. ఆ పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ విజయాన్ని అందరూ ఊహించిందే కూడా. అయితే.. కవిత గెలిచాక ఆమె కేబినెట్‌లోకి రాబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కవితను కూడా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున గులాబీ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ.. పార్టీలోని సీనియర్‌‌ లీడర్లు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ పదవికి కేవలం 15 నెలలు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నిక జరగుతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో విజయం సాధించిన కవిత.. అప్పుడు కూడా విజయం సాధించే తీరుతారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు.

సరే.. ఇంతవరకు బాగానే ఉన్నా.. కవిత అలా గెలిచిందో లేదో వెంటనే కేబినెట్‌ బెర్త్‌ ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కవితను మంత్రివర్గంలోకి తీసుకోకుంటే కేసీఆర్ రాజ్యసభకు పంపేవారన్న వాదన కూడా ఉంది. ఒకానొక దశలో కవిత రాజ్యసభ నే కోరుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనిని కొట్టిపారేస్తూ కవితను ఢిల్లీకి దూరం చేస్తూ తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే ఎమ్మెల్సీని చేసి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొందరు గట్టిగా పార్టీలోనే నమ్ముతున్నారు.

Also Read: బీహార్‌‌ ఎన్నికలు: కాంగ్రెస్‌ బలం ఎంత?

అయితే.. ప్రస్తుతం వినిపిస్తున్న మాటేంటంటే.. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే కొందరిని తొలగించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆ పనిచేయరట. మంత్రివర్గంలో 17 మందికే అవకాశముంది. ఇప్పటికే ఆ కోటా పూర్తి కావడంతో మరోసారి విస్తరణ జరిగితే తప్ప కవితకు ఇప్పట్లో మంత్రి అయ్యే ఛాన్స్ లేదంటున్నారు సీనియర్‌‌ నేతలు. కేసీఆర్ కూడా కవితను అంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకోరన్నది వినిపిస్తున్న మాట. అయితే.. ప్రస్తుతానికి మంత్రిపదవి ఇవ్వకపోయినా కేబినెట్ హోదా కలిగిన ఏదో ఒక పదవి ఇవ్వడం మాత్రం గ్యారంటీగా కనిపిస్తోంది. అంటే అధికారికంగా మంత్రి కాకున్నా.. మంత్రి హోదాలాంటి పదవి మాత్రం కవితకు దక్కనుందన్నమాట.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper