Actress in Instagram: ఈ ఇన్ స్టాగ్రామ్ వచ్చాక హీరోయిన్ల అందాల ప్రదర్శనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మాట్లాడితే ఫోటో షూట్ చేసి బోల్డ్ ఫోటోలు అప్ లోడ్ చేసేస్తున్నారు. నిజమే, హీరోయిన్ అంటే అందంగా ఉండాలి, అందాల ప్రదర్శన చేయాలి తప్పదు. ఈ సినీ లోకంలో ముఖ్యంగా అందాలను మాత్రమే నమ్ముకునే ఈ తెలుగు వర్ధమాన దర్శకులు ఉన్న కాలంలో బోల్డ్ ఫోజులు తప్పవు. ఏ హీరోయిన్ తప్పించుకోలేదు కూడా.

పైగా సినీ వినోదంలో అదో ప్రధాన భాగం అయిపోయింది కాబట్టి.. ఎవరూ కాదనలేరు. కానీ దేనికైనా కొన్ని హద్దులున్నాయి. పరిధులు ఉంటాయి. పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ పై బరి తెగించకూడదు. బరి తెగిస్తే అవకాశాలు దక్కుతాయని కొత్త తారలకు ఓ ఆశ ఉంటుంది. దాంతో కొంతమంది భామలు ఛీ ఛీ.. ఇన్ స్టాగ్రామ్ ను బూతు మయం చేసేస్తున్నారు. వారి వాలకం చూసి నెటిజన్లు కూడా చీదరింపులు చూపించాల్సి వస్తోంది.
Also Read: Mahesh Babu: ప్చ్.. ఏమిటి మహేష్ ఇలా అయిపోయాడు ?
సినిమాల్లో బికినీ వేసి సన్నివేశం డిమాండ్ చేసిందని వివరణ ఇవ్వొచ్చు. మరి ఇన్ స్టాగ్రామ్ లో బికినీ వేయాల్సిన అవసరం ఏముంది ? అలా వేస్తె ఏమనాలి ? బరి తెగింపు, సిగ్గులేనితనం అనాలి. అయినా సినిమాకి, సోషల్ మీడియాకి తేడా తెలియకుండా పబ్లిక్ గా కుర్ర హీరోయిన్లు బరితెగించడం మారుతున్న కాలానికి ప్రత్యక్ష సాక్ష్యం అనుకోవాలేమో.
గత కొంత కాలంగా ఈ పోకడ మరీ ఎక్కువ అయిపోయింది. ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే.. ఆడియో కార్యక్రమాల్లో కూడా కొందరు హీరోయిన్లు మరీ ఎబ్బెట్టుగా తొడలపై వరకు అండర్ వేర్ కన్పించేలా కురచ దుస్తులతో దర్శనం ఇస్తున్నారు. వీళ్ల హడావుడి దెబ్బకు సదరు కార్యక్రమానికి వచ్చిన వారంతా అసలు కార్యక్రమాన్ని వదిలేసి ….వీళ్ల వైపే చూడటం లాంటి ఘటనలు కూడా ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి.
అసలు వీళ్లది అవకాశాలు అందుకోవాలనే ఆరాటమా ? లేక, వెర్రితనమా ? పబ్లిక్ గా బరితెగిస్తే కొత్త అవకాశాలు కాదు, వచ్చే అవకాశాలు కూడా పోతాయి.
Also Read: Pan India Movies: జనవరి 2 తర్వాతనే పాన్ ఇండియా సినిమాలపై తుది నిర్ణయం