Suriya And Vikram Movie Updates: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన నటుడిగా పేరును సంపాదించుకున్న వాళ్ళలో విక్రమ్ మొదటి స్థానంలో ఉంటాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే అపరిచితుడు లాంటి డిఫరెంట్ సినిమాలో ప్రయోగాత్మకమైన క్యారెక్టర్ ను పోషించి తనకు నటనలో ఎవరు పోటీకి రారు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. ఇక అలాంటి విక్రమ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్లుగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం…ఇక పా రంజిత్ దర్శకత్వం లో చేసిన ‘తంగలాన్’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అనుకున్నారు. కానీ కానీ ఈ సినిమా సక్సెస్ అయినప్పటికి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టలేకపోయింది…
ఇక విక్రమ్ తన కెరియర్ స్టార్టింగ్ లోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ ని మొదలుపెట్టాడు. అయితే విక్రమ్ చేయాల్సిన ఒక సూపర్ హిట్ సినిమాను మరొక స్టార్ హీరో అయిన సూర్య చేసి సక్సెస్ ను సాధించాడనే విషయంలో మనలో చాలా మందికి తెలియదు… డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన ’24’ సినిమాని మొదట విక్రమ్ తో చేయాలనుకున్నారట…
కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సూర్య దగ్గరికి వెళ్లడంతో విక్రమ్ కే కుమార్ సూర్యని హీరోగా పెట్టీ ఈ సినిమాని చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా డిఫరెంట్ ప్రయత్నంగా నిలవడమే కాకుండా సూర్య కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.
ఇక విక్రమ్ కనుక ఆ క్యారెక్టర్ లో నటించి ఉంటే అతను కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సినిమాలను ముందుకు తీసుకెళ్లేవాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నాడు… విక్రమ్ తో పోలిస్తే సూర్యకి కొంతవరకు మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సూర్యని తీసుకున్నారని కొంతమంది అంటుంటే విక్రమ్ కథ విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ గా లేకపోవడం వల్లే విక్రమ్ నుంచి ఆ స్టోరీ సూర్య వరకు వచ్చిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా 24 సినిమా అనేది ఒక డిఫరెంట్ ప్రయత్నంగా మిగిలిపోయింది…
