Homeఎంటర్టైన్మెంట్Nani Gang Leader: నాని 'గ్యాంగ్ లీడర్' లో నటించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు...

Nani Gang Leader: నాని ‘గ్యాంగ్ లీడర్’ లో నటించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఎంత హాట్ గా తయారైందో చూడండి!

నాని కెరీర్ లో సక్సెస్ సాధించని సినిమాలు కూడా కొన్ని చాలా బాగుంటాయి. వాటిల్లో ఒకటి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన 'గ్యాంగ్ లీడర్' అనే చిత్రం. ఈ సినిమాలో ప్రముఖ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్న ఈ సినిమాకి టీవీ టెలికాస్ట్ లో కూడా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.

Nani Gang Leader: స్టార్ హీరోల లీగ్ లోకి అతి చేరువలో ఉన్న యంగ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నేచురల్ స్టార్ నాని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు,బ్లాక్ బూస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు ఆడియన్స్ కి నాని సినిమా విడుదల అవుతుందంటే, కచ్చితంగా సూపర్ హిట్ అనే భావన వచ్చేసింది. టాక్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు ప్రేక్షకులు కదిలే రోజులు వచ్చేసాయి. ‘దసరా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఆయన, ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రం తో మరో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇక రీసెంట్ గానే ‘సరిపోదా శనివారం’ చిత్రంతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాని, తన మార్కెట్ పరిధిని మరింత విస్తరింపచేసాడు.

ఇది ఇలా ఉండగా నాని కెరీర్ లో సక్సెస్ సాధించని సినిమాలు కూడా కొన్ని చాలా బాగుంటాయి. వాటిల్లో ఒకటి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్ లీడర్’ అనే చిత్రం. ఈ సినిమాలో ప్రముఖ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా నటించగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్న ఈ సినిమాకి టీవీ టెలికాస్ట్ లో కూడా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఇందులో నాని అన్యాయానికి గురైన 5 మంది మహిళలకు అండగా నిలబడే అబ్బాయిగా కనిపిస్తాడు. ఆ అమ్మాయిలలో ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది. తప్పిపోయిన తన అన్నయ్య కోసం ఎదురు చేసే చెల్లి గా నటించిన ఈ చిన్నారి పేరు శ్రీయ కొంతం. ఈ అమ్మాయిని డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఎక్కడి నుండి తీసుకొచ్చాడో తెలియదు కానీ, కేవలం ఈ సినిమాలో తప్ప మరో సినిమాలో ఎక్కడా కనిపించలేదు. కనీసం పెద్దయ్యాక అయినా ఈమె సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు కానీ, అది కూడా జరగలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఈమె నెటిజెన్స్ కి బాగా దగ్గర్లోనే ఉంది.

తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలను చూసిన తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం లో అమాయకంగా కనిపిస్తూ, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే అమ్మాయి ఇంత హాట్ గా తయారైందా?, ఇప్పటి తరం కుర్ర హీరోయిన్లకు ఈమె ఏమాత్రం తీసిపోవడం లేదు కదా?, అసలు ఎందుకు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు, వెంటనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేయండి అంటూ ఆమె పోస్టుల కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్. మరి ఈమె హాట్ ఫోటోలను చూసి ఏ దర్శక నిర్మాత అయిన సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Kontham (@shriya.kontham)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper