Bacteria : చాలామందికి నీటిలో దిగడం అంటే చాలా ఇష్టం. బీచ్‌లు, జలాశయాలు, వర్షాల నీరు, వాటర్ పాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్ వంటి నీటిలో ఎక్కువగా దిగుతుంటారు. ఒక్కసారి నీటితో ఇలా ఎంజాయ్ చేస్తే బయటకు రారు. అదే ఈ బ్యాక్టీరియా గురించి తెలిస్తే ఇక అసలు నీటిలోకి అడుగు కూడా పెట్టరు. అంత ప్రమాదమైన బ్యాక్టీరియా ఇది. ఈ బ్యాక్టీరియా ఒక్కసారి సోకితే ఇక అంతే సంగతులు. ఒక్కసారికే మీ ప్రాణాలు పోతాయి. ఇంతకీ ఈ బ్యాక్టీరియా ఏంటి? ఇది అంత ప్రమాదమైనదా? ఒక్కసారి వస్తే ప్రాణాలు పోతాయా? పూర్తి వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.
స్విమ్మింగ్ ఫూల్ లేదా సరదాగా వర్షం నీటిలో ఒక గంట ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరు డేంజర్‌లో పడినట్లే. ఇలా నీటిలో మనం దిగినప్పుడు బ్యాక్టీరియా ఒకటి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది శరీరం లోపలి నుంచి మాంసాన్ని పూర్తిగా తినేస్తుంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరం. ఒక్కసారి వస్తే ఇక మనిషి బ్రతికే ఛాన్స్ లేదని వైద్యులు చెబుతున్నారు. ఇంత డేంజర్ బ్యాక్టీరియాను నైక్రోటైజింగ్ ఫాసిటిస్ అంటారు. దీనినే ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఈ బ్యాక్టీరియా ఒక్కసారి శరీరంలో ప్రవేశిస్తే ఇక చావే దిక్కు అని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి ప్రవేశించి మృదు కణాజాలాన్ని ప్రభావితం చేస్తుంది. కండరాల చుట్టూ ఉన్న కొవ్వు, ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. పొరపాటున నీటిలో దిగిన కూడా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. స్విమ్మింగ్ ఫూల్, నదుల్లో స్నానాలకు దూరంగా ఉండాలి.
కేవలం నీటి ద్వారా మాత్రమే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో చేరిన వెంటనే బాడీ మొత్తం వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన వెంటనే నీరసం, చలి జ్వరం, తీవ్రమైన మంట, శరీరంపై వాపులు, నొప్పులు, రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ వచ్చిన ఒకటి లేదా రెండు రోజులకే ప్రాణం పోతుంది. అసలు బతికే అవకాశం కూడా ఉండదు. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా 50 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ బ్యాక్టీరియాను మాంసం తినే బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఎక్కువగా మధుమేహం, ఆల్కహాల్ తాగేవారి శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా జపాన్‌లో అధికంగా వ్యాపించింది. దీనివల్ల జపాన్‌లో 977 మంది ఈ ఏడాది చనిపోయారు. కలుషితమైన నీటిలో అసలు దిగకూడదు. ఈ బ్యాక్టీరియా సోకిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే బతికే అవకాశం కాస్త ఉంటుంది. ఈ వ్యాధి సోకిన ప్రతీ పది మందిలో ముగ్గురు చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Once the necrotizing fasciitis bacteria enters the body it is dangerous
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com