Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Kushi: 'ఖుషి' లో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్ చేసిన ఈ...

Pawan Kalyan Kushi: ‘ఖుషి’ లో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్ చేసిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఇతను ఏ రేంజ్ లో ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

అప్పట్లో ఈ చిత్రం రీ రిలీజ్ లో కూడా సంచలనం సృష్టించింది. 72 సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రీ రిలీజ్ లో కూడా 15 సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకుంది.

Pawan Kalyan Kushi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచి, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం ‘ఖుషి’. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి ఇలా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ నెంబర్ 1 హీరో స్థానానికి దగ్గరగా చేర్చింది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ చిత్రం టీవీ టెలికాస్ట్ వేసినప్పుడు మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. పవన్ కళ్యాణ్, భూమిక మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ, పాటలు,లవ్ ట్రాక్, ఇలా ఒక్కటా రెండా, ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ చిత్రం ఆరోజుల్లోనే 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

అప్పట్లో ఈ చిత్రం రీ రిలీజ్ లో కూడా సంచలనం సృష్టించింది. 72 సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రీ రిలీజ్ లో కూడా 15 సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకుంది. 2022 వ సంవత్సరం లో న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం గ్రాండ్ గా విడుదల చేయగా, ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుమారుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ, మురారి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యేవరకు ఈ సినిమా రికార్డ్స్ పదిలంగా ఉన్నాయి. త్వరలోనే మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు, నటించిన ప్రతీ ఒక్కరు బాగా ఫేమస్ అయ్యారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారక్టర్ లో ఎంతో క్యూట్ గా కనిపించిన ఒక బుడ్డోడు మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. అంత తేలికగా మర్చిపోయే ఫేస్ కూడా కాదు ఇది. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య సెలెక్ట్ చేసిన క్యూట్ కిడ్ ఇతను. ఇతని పేరు ఆర్యన్. కేవలం ఖుషి లో తప్ప మరో సినిమాలో నటించలేదు. అవకాశాలు వచ్చినా కూడా ఆ బుడ్డోడి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. సినీ ఇండస్ట్రీ కి దూరంగా పెరిగిన ఈ కుర్రాడు, ఇప్పుడు లండన్ లో డిగ్రీ చదువుతున్నట్టు తెలుస్తుంది. చదువు పూర్తి అయ్యాక అక్కడే ఆ కుర్రాడు ఉద్యోగం చేయబోతున్నాడట. పవన్ కళ్యాణ్ కి ఈ కుర్రాడు పెద్దగా పరిచయం లేదు కానీ, రెండు దేశాయ్ కి మాత్రం బాగా పరిచయమట. ఇప్పటికీ కూడా ఇతనితో మాట్లాడుతుందట. అకిరా నందన్ కూడా ఆ కుర్రాడికి బెస్ట్ ఫ్రెండ్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper