Homeఆంధ్రప్రదేశ్‌AP Congress: ఏపీ కాంగ్రెస్.. షర్మిలకు కూడా కష్టమే!

AP Congress: ఏపీ కాంగ్రెస్.. షర్మిలకు కూడా కష్టమే!

AP Congress: ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందా? ఆ పార్టీకి ఛాన్స్ ఉందా? షర్మిల తో అది సాధ్యమేనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందు షర్మిల పిసిసి అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని అంతా భావించారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క షర్మిల మాత్రమే కడపలో ప్రభావం చూపించారు. లక్ష యాభై వేల వరకు ఓట్లు సాధించగలిగారు. మిగతా చోట్ల కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. పోనీ ఎన్నికల తరువాత అయినా పుంజుకుందా అంటే అది కనిపించడం లేదు. వైసీపీ ఓటమితో ఆ పార్టీ నుంచి చేరికలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా పేరు మోసిన నేత కాంగ్రెస్ వైపు రాలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడగలదా? అందుకు తగ్గ ఛాన్స్ ఉందా? అంటే ఏదీ కనిపించడం లేదు. మరోవైపు జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీ మళ్లీ పరాజయాల బాట పడుతోంది. దీంతో ఆ ప్రభావం ఏపీ లాంటి రాష్ట్రాల్లో పడుతోంది. అయితే ఎక్కడా లేని విధంగా ఏపీలో పూర్తిగా నిర్వీర్యం అయింది కాంగ్రెస్ పార్టీ. దానికి జవసత్వాలు నింపడం షర్మిల వల్ల కూడా కాలేదు. దీంతో ఏపీ పై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకుంటుంది.

* జాతీయస్థాయిలో బలోపేతం అయితేనే
కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే అది జాతీయస్థాయిలో బలోపేతం అయితేనే సాధ్యం. ఎప్పుడైతే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు కనబరుస్తుందో.. ఆ మరుక్షణం ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. వైసిపి ఘోర పరాజయం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ సాధారణంగా బలపడాలి. ఎందుకంటే వైసీపీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ శ్రేణులే. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కాకపోవడం.. వివిధ రాష్ట్రాల్లో ఘోర పరాజయం చవిచూడడంతో.. అటువైపు వచ్చేందుకు వైసిపి నేతలు ఇష్టపడడం లేదు.

* అప్పట్లో వరుస విజయాలు
కర్ణాటక తో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పట్లో ఏపీ ఫై కూడా ఆ ప్రభావం పడింది. వైసీపీలో సైతం ఒక చేంజ్ కనిపించింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా… కాంగ్రెస్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం ఉందన్న ధీమా నేతల్లో వ్యక్తం అయింది. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆశలు సన్నగిల్లాయి. అటు తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో.. తమకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదని తేలిపోయింది. అందుకే షర్మిల ఎంతగానో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మైలేజీ రావడం లేదు. షర్మిల కాదు అంతకంటే చరిష్మ కలిగిన నేతకు పగ్గాలు అందించినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకు వెళ్లలేని దుస్థితి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper