Naresh – Pavitra Lokesh: పవిత్ర లోకేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సినిమా పరిశ్రమలో పవిత్ర నరేష్ ల సంబంధం వైరల్ గా మారింది. వారిద్దరు కలిసి సహజీవనం చేయడం సంచలనంగా మారింది. దీంతో పవిత్ర లోకేష్ పేరు ఇప్పుడు పరిశ్రమలో ప్రచారంలో ఉన్న పేరు. అందరి నోట వినిపించే పేరు. దీంతో ఆమెకు సహజంగా ప్రచారం అవసరం లేదు. సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తున్నా నిజజీవితంలో భార్య పాత్రలో చక్కగా జీవిస్తోంది. దీంతో వారి బంధం కాస్త అందరికి తెలిసిపోవడంతో రచ్చ రచ్చ అవుతోంది.

తాజాగా పవిత్ర లోకేష్ తన పారితోషికం పెంచేశారు. గతంలో రోజుకు రూ.60 వేల వరకు తీసుకున్న ఆమె ప్రస్తుతం రూ. లక్షకు పెంచేసింది. దీంతో ఆమెకు వచ్చిన ప్రచారంతోనే ఆమె రేటు పెంచినట్లు తెలుస్తోంది. నరేష్ తో ఉన్న సంబంధం కారణంగా ఆమెకు అవకాశాలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కానీ ఇలా రెమ్యునరేషన్ పెంచితే అవకాశాలు తగ్గుతాయేమోననే సందేహాలు కూడా వస్తున్నాయి. తల్లి పాత్రల్లో ఒదిగి నటించే ఆమెకు వరుస అవకాశాలు రావడంతోనే పారితోషికం పెంచేసినట్లు సమాచారం.
ఇటీవల విడుదలైన రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ తల్లిగా నటించింది. ఇందులో నరేష్ కూడా ఓ క్యారెక్టర్ చేశారు. వీరిద్దరు కలిసి నటించే సన్నివేశంలో ప్రేక్షకులు ఈలలు, గోలలు వేయడంతో థియేటర్ అంతా సందడి నెలకొంది దీంతో వీరిద్దరి బంధం గురించి సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనంగా చెప్పుకుంటున్నారు. భవిష్యత్ లో ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిపాత్రల్లో నటించే ఆమె నరేష్ తో సహజీవనం చేస్తుండటంతో నరేష్ మూడో భార్యకు నచ్చడం లేదు. దీంతో వారిని హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీయడంతో వారి సంబంధం వైరల్ గా మారింది.

స్టార్ హీరోలందరికి తల్లిపాత్రలో నటించి మెప్పించారు. సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ తల్లిగా నటించింది. దువ్వాడ జగన్నాథంలో కూడా తల్లి పాత్ర చేసి ప్రశంసలు అందుకుంది. జైలవకుశ, సర్కారు వారి పాట లాంటి సినిమాల్లో కూడా తల్లి పాత్రల్లోనే ఒదిగిపోయింది. సహజంగా కన్నడ నటి అయినా తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకోవడం విశేషం. కానీ నరేష్ తో ఉన్న సంబంధం వల్ల భవిష్యత్ లో ఆమెకు అవకాశాలు తగ్గుతాయనే వదంతులు కూడా వస్తున్నాయి. కానీ ఏం జరుగుతుందో చూడాలి మరి.