spot_img
Homeఎంటర్టైన్మెంట్Govinda Govinda Child Artist: షాకింగ్..'గోవిందా గోవిందా' చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడెలా తయారయ్యాడో చూస్తే నోరెళ్లబెడుతారు!

Govinda Govinda Child Artist: షాకింగ్..’గోవిందా గోవిందా’ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడెలా తయారయ్యాడో చూస్తే నోరెళ్లబెడుతారు!

Govinda Govinda Child Artist: అక్కినేని నాగార్జున తో శివ లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఆయనతోనే ‘గోవిందా గోవిందా’ అనే చిత్రం చేసాడు. అతిలోక సుందరి శ్రీదేవి ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ కమర్షియల్ గా సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ కూడా టీవీ టెలికాస్ట్ లో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి ఈ చిత్రానికి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.దేవుడిని నమ్మే మనస్తత్వం లేని రామ్ గోపాల్ వర్మ నుండి ఈ రేంజ్ సినిమా ఎలా వచ్చింది అని చూసే ప్రేక్షకులు ఆశ్చర్యపోక తప్పదు. ఆ రేంజ్ లో ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది.

అయితే ఈ చిత్రం లో నాగార్జున, శ్రీదేవి క్యారెక్టర్స్ తో పాటుగా ఒక చైల్డ్ ఆర్టిస్టు క్యారక్టర్ కూడా ఎంతో కీలకమైనది. ఆ ఆర్టిస్ట్ పేరు అనిల్ రాజ్. ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురం లో పుట్టి పెరిగిన అనిల్ రాజ్ ‘గోవిందా గోవిందా’ సినిమా కి ముందే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. కరాటీ లో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించిన ఈయన, ఆ తర్వాత కొన్ని క్లిష్టమైన పోటీలలో గెలిచి లిమ్కా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కాడు. అలా పాపులారిటీ సంపాదించిన అనిల్ రాజ్ రామ్ గోపాల్ వర్మ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. వెంటనే తన సినిమాలో తీసుకొని మంచి క్యారక్టర్ వేయించాడు.

అతనిలోని టాలెంట్ ని గమనించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, రాజా సింహం వంటి చిత్రాలలో నటించాడు. ముఖ్యంగా ముద్దుల ప్రియుడు చిత్రంలో ఈ కుర్రాడు విక్టరీ వెంకటేష్ ని ఆట పట్టించే సన్నివేశాలను అంత తేలికగా మరచిపోలేము. అయితే మిగతా చైల్డ్ ఆర్టిస్ట్స్ లాగా అనిల్ రాజ్ కూడా పెద్దయ్యాక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూడు సినిమాల తర్వాత ఆయన మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్‌ స్కూల్ లో విద్యాబ్యాసం పూర్తి చేసిన ఆయన, ఆ తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ని కూడా పూర్తి చేసాడు. రీసెంట్ గా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అలనాటి బాలనటులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసింది. ఈ కార్యక్రమానికి అనిల్ రాజ్ కూడా పాల్గొన్నాడు. అయితే ఆయన అందరిలాగా ఎక్కువసేపు మాట్లాడలేకపోయాడు. చిన్నతనం లో ఎంతో క్యూట్ గా కనిపించిన అనిల్ రాజ్, ఇప్పుడు లావుగా కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం అనిల్ రాజ్ ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అనే విషయాలేవీ కూడా ఈ ఇంటర్వ్యూ లో చెప్పలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper