Homeఎంటర్టైన్మెంట్Aata dance show prize money: 'ఆట' టైటిల్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ ఎంతో...

Aata dance show prize money: ‘ఆట’ టైటిల్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? ‘బిగ్ బాస్’ కి కూడా ఇంత ఇవ్వరుగా!

Aata dance show prize money: ‘జీ తెలుగు’ ఛానల్ లో రీసెంట్ గానే మొదలైన ‘ఆట'(Aata Dance Show) డ్యాన్స్ రియాలిటీ షో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ డ్యాన్స్ రియాలిటీ షో నాలుగు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోకి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. అంతే కాదు, ఈ […]

Aata dance show prize money: ‘జీ తెలుగు’ ఛానల్ లో రీసెంట్ గానే మొదలైన ‘ఆట'(Aata Dance Show) డ్యాన్స్ రియాలిటీ షో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ డ్యాన్స్ రియాలిటీ షో నాలుగు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోకి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది. అంతే కాదు, ఈ షోకి ఆమె ఒక జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. ఆమెతో పాటు జానీ మాస్టర్, సీనియర్ హీరోయిన్ రాధికా వంటి వారు కూడా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. సమీరా భరద్వాజ్, విష్ణు ప్రియా, కావ్యశ్రీ, వంశీధర్ లు టీం లీడ్స్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఈ షోలో 16 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. ఒక్కో టీం కి నలుగురు కంటెస్టెంట్స్ ఉంటారట.

వీళ్ళని టీం లీడ్స్ 40 లక్షల రూపాయిలు ఇచ్చి కొనుగోలు చేశారు. అయితే ప్రతీ ఎపిసోడ్ లో అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఒక కంటెస్టెంట్ కి 4 లక్షల రూపాయిలు ఇస్తారట. ఆ డబ్బులన్నీ ఒక 40 లక్షలతో పాటు ఒక వాల్ట్ లో జమ అవుతూ ఉంటుంది. అలా చివరి వరకు కంటెస్టెంట్స్ గెలుచుకున్న డబ్బులన్నీ కలిపితే 75 లక్షల నుండి కోటి రూపాయిల వరకు ఆ వాల్ట్ లో ఉంటుంది. ఇదంతా ఆట టైటిల్ విన్నర్ కి సొంతం అవుతుందట. ఈ రేంజ్ ప్రైజ్ మనీ ఇప్పటి వరకు హిస్టరీ లో ఏ డ్యాన్స్ షోలో కూడా ఇవ్వలేదు. అంతెందుకు, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏడాది నిర్వహించే బిగ్ బాస్ రియాలిటీ షో టైటిల్ విన్నర్ కి కూడా ఇంత ప్రైజ్ మనీ ఇవ్వడం లేదు. మరి ఈ ప్రైజ్ మనీ ని గెలుచుకునేది ఎవరో చూడాలి. ఒక్కొక్కరి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ వేరే లెవెల్ లో ఉంది.

ఇకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఈ షోలో చాలా విభిన్నంగా ఉంటుందట. వరుసగా రెండు సార్లు ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళు సుప్రీమ్ అనే స్థానం లో కూర్చుంటారట. ఆ కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది నిర్ణయిస్తారట. సుప్రీమ్ స్థానం లో కూర్చున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ చెయ్యాలనుకున్న టీం ని సెలెక్ట్ చేస్తుందట. ఆ టీం లీడ్ తమ టీం నుండి ఎవరిని తొలగించాలో నిర్ణయిస్తారట. అంటే రాబోయే రోజుల్లో గొడవలు కూడా బాగానే ఉండబోతున్నాయి అన్నమాట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ప్రతీ వారం ఒక్కో టీం నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫార్మ్ చేస్తారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper