Unmarried Heroines: ఈడంతా పోయినాక పెళ్లెందుకు ఆకలంతా పోయినాక అన్నమెందుకు అంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అప్పుడే వయసు కోరికలు తీర్చుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా హీరోయిన్లు అవకాశాల గొడవల్లో పడి వివాహ తంతును వాయిదా వేస్తున్నారు. దీంతో వారి వయసు అడవి కాచిన వెన్నెలగా మారుతోంది. దీంతో వయసు పైబడుతున్నా వారి వివాహం గురించి మాట ఎత్తడం లేదు.

తెలుగులో చాలా మంది సీనియర్లు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. 50 వసంతాల్లోకి అడుగుపెట్టినా వారికి వివాహం గురించి పట్టింపు ఉండటం లేదు. ఇక పెళ్లి అనే ఊసే లేకుండా పోతోంది. ఫలితంగా వారి పెళ్లి వయసు దాటిపోయి బామ్మలుగా మారుతున్నారు. అప్పట్లో ప్రేమదేశం సినిమాతో అదరగొట్టిన హీరోయిన్ టబు ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఆమె నాగార్జునతో ప్రేమ విఫలం కావడంతోనే వివాహానికి దూరమైనట్లు తెలుస్తోంది.
Also Read: Tollywood Film Workers Strike: టాలీవుడ్ లో సినిమా కార్మికుల గొడవలకు కారణమేంటి? ఏం జరుగుతోంది?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ఒకప్పటి హీరోయిన్ సితార కూడా పెళ్లి చేసుకోలేదు. చిరంజీవితో రుద్రవీణ, రౌడీ అల్లుడు చిత్రాల్లో నటించిన శోభన కూడా వివాహం చేసుకోలేదు. ఆమె ప్రేమ విఫలం కావడంతోనే మూడుముళ్ల బంధానికి దూరమైనట్లు తెలుస్తోంది. చిరంజీవితోనే ఘరానా మొగుడు వంటి హిట్ సినిమాలో నటించిన నగ్మా కూడా ఇంతవరకు పెళ్లిపీటలు ఎక్కలేదు. కన్నడ నటుడు శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్, క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణాలు నడిపినా ప్రస్తుతం మాత్రం వివాహం లేకుండా అలాగే ఉండిపోయింది.

ముత్యాల ముగ్గు హీరోయిన్ సంగీత కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమెది కూడా లవ్ సమస్యే. ఎవరినో ఒకరిని ప్రేమించి వారి నుంచి దూరంగా ఉండటంతోనే పెళ్లి గురించి ఆలోచనలు చేయడం లేదు. బాలీవుడ్ నటి అమీషా పటేల్ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. సీనియర్ నటీమణులు రజిత, రాగిణి కూడా పెళ్లిళ్లు చేసుకోలేదు. వీరంతా యాభై ఏళ్లు దాటడంతో ఇక చేసుకున్నా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అందుకే వివాహం గురించి ఆలోచించడం లేదని చెబుతున్నారు. కానీ మగ తోడు లేకుండా ఎన్నాళ్లు ఉంటారో తెలియడం లేదు.
Also Read: Balakrishna- Chiranjeevi: బాలయ్యతో చిరంజీవి ఖాయమేనా?