Balakrishna- Chiranjeevi: బాలయ్యతో చిరంజీవి ఖాయమేనా?
Balakrishna Chiranjeevi: బాలయ్యకు చిరంజీవి మిత్రుడా? శత్రువా? అంటే చెప్పడం కష్టమే. వీళ్ళ మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. చిరంజీవి పొలిటికల్ గా ఫెయిల్ అయ్యాక బాలయ్య చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపాయి. మా నాన్న ఎన్టీఆర్ లా మిగతా హీరోలు పొలిటికల్ గా సక్సెస్ కాలేదు. మా బ్రీడ్ వేరు, బ్లడ్ వేరు అంటూ ఆయన చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీకి కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు నాగబాబు […]

Balakrishna Chiranjeevi: బాలయ్యకు చిరంజీవి మిత్రుడా? శత్రువా? అంటే చెప్పడం కష్టమే. వీళ్ళ మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. చిరంజీవి పొలిటికల్ గా ఫెయిల్ అయ్యాక బాలయ్య చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపాయి. మా నాన్న ఎన్టీఆర్ లా మిగతా హీరోలు పొలిటికల్ గా సక్సెస్ కాలేదు. మా బ్రీడ్ వేరు, బ్లడ్ వేరు అంటూ ఆయన చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీకి కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు నాగబాబు బాలయ్యపై ఓ సిరీస్ ఆఫ్ వీడియోలు చేశారు. ఆయన్ని ఏకి పారేశారు. ఆ గొడవ సద్దుమణిగాక మరో వివాదం చోటు చేసుకుంది.

Balakrishna Chiranjeevi
కరోనా సంక్షోభ సమయంలో చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమ పెద్దలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. ఈ మీటింగ్ కి బాలయ్యకు ఆహ్వానం లేదు. ఈ క్రమంలో బాలయ్య ఫైర్ అయ్యారు. నన్నెందుకు పిలవలేదు, అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా నాగబాబు బాలయ్యపై మండిపడ్డారు. పరిశ్రమలో మీరు ఒక హీరో మాత్రమే పరిశ్రమ మొత్తం మీది కాదు, అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ గొడవ జరిగి కూడా చాలా కాలం అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పటికీ చిరంజీవి బాలయ్య ఎదురు పడితే ఆప్యాయంగా పలకరించుకోకమానరు.
Also Read: Naresh- Pavitra Lokesh: రహస్య వివాహం నిజమే? మహాబలేశ్వర్ లో నరేష్, పవిత్ర లోకేష్!
వీరిద్దరూ కలిసి వేదిక పంచుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. అది సాకారమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్న సమాచారం అందుతుంది. బాలయ్య హోస్ట్ గా ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అన్ స్టాపబుల్ షో డైరెక్టర్ బి వి ఎస్ రవి తన టీమ్ తో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు.

Balakrishna Chiranjeevi
మోస్ట్ సక్సెస్ ఫుల్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న అన్ స్టాపబుల్ సీజన్ వన్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, మహేష్ బాబు, రాజమౌళి, రానా వంటి స్టార్స్ పాల్గొన్నారు. సెకండ్ సీజన్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకరైన చిరంజీవి పాల్గొనడం ఖాయమే అంటున్నారు. అన్ స్టాపబుల్ షోకి చిరంజీవిని గెస్ట్ గా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు మొదలయ్యాయట. ‘ఆహా’ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ యాప్ కాగా చిరంజీవి కాదనకుండా వస్తారనే నమ్మకం అందరిలో ఉంది. దీనిపై అధికారి సమాచారం రావాల్సి ఉండగా ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇంకా ఈ లిస్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ఉన్నారు.
Also Read:Payal Rajput: పాయల్ రాజ్ పుత్ బోల్డ్ ఫోటో షూట్… బ్రా లేకుండా బటన్స్ తీసేసి!
