spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi- Vishal: హీరో విశాల్ కుటుంబంతో చిరంజీవికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఇదే..

Chiranjeevi- Vishal: హీరో విశాల్ కుటుంబంతో చిరంజీవికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఇదే..

Chiranjeevi- Vishal: తమిళంలో స్టార్ హీరో విశాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే విశాల్ తెలుగు వాడే. కానీ తమిళంలో ఎక్కువగా పేరు తెచ్చుకున్నాడు. విశాల్ హీరోగా ఎదిగేంత వరకు అతడి బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ విశాల్ హీరో కాకముందు నుంచే అతడి తండ్రి జీకే రెడ్డి జీకే ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పలు చిత్రాలను తమిళంలో తెలుగులో నిర్మించాడు.

Chiranjeevi- Vishal
Chiranjeevi- Vishal

అయితే జీకే రెడ్డి తెలుగులో మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ సినిమా తీశారు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అలా విశాల్ కుటుంబంతో చిరంజీవికి తియ్యటి అనుబంధం ఉంది. ఈ సినిమానే ఎస్పీ పరశురామ్. తమిళంలో సత్యరాజ్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్టర్ వెట్రివేల్’ సినిమాను తెలుగులో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా ‘ఎస్పీ పరశురామ్‌’గా రీమేక్ చేశారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.

Also Read:  బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ లేటెస్ట్ కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి మెగా హిట్ తర్వాత విశాల్ తండ్రి జీకే రెడ్డి నిర్మించిన ఎస్పీ పరశురామ్ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత జీకే రెడ్డి తెలుగులో పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. విశాల్‌ హీరోగా మారిన తర్వాత ఎక్కువ అతడితోనే ఈ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు.

Chiranjeevi- Vishal
Chiranjeevi- Vishal

విశాల్‌ హీరోగా మీరాజాస్మిన్ హీరోయిన్‌గా జీకే ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించిన పందెంకోడి సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే విశాల్‌కు తెలుగులో మార్కెట్ సృష్టించిన సినిమా పందెంకోడి. మూడేళ్ల కిందట పందెంకోడి సీక్వెల్‌ను కూడా తీయగా అది నిరాశపరిచింది.

Also Read:  బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...
Oktelugu Epaper