Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్ ఓటీటీ నాన్‌స్టాప్ రెండో వారాంతానికి చేరింది. తొలివారం మొమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తి రేపుతోంది. రెండో వారం కూడా నామినేషన్‌లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ జాబితాలో ఏడుగురు వారియర్స్ సభ్యులు, ఐదుగురు ఛాలెంజర్స్ సభ్యులు ఉన్నారు.

నామినేషన్స్‌లో ఉన్నవారిలో సరయు, అఖిల్, హమీదా, అరియనా, నటరాజ్ మాస్టర్, అషు రెడ్డి, మహేష్ విట్టా, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, యాంకర్ శివ ఉన్నారు. అఖిల్, అరియానా, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, హమీదా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నా వీళ్లకు ఓట్లు పడినా, పడకపోయినా ఎలిమినేషన్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది.
Also Read: బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ లేటెస్ట్ కలెక్షన్స్
అయితే ఈవారం నామినేషన్‌లలో ఉన్న సభ్యుల్లో యాంకర్ శివకు ఓట్లు బాగానే పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ భావిస్తున్న బిందు మాధవితో యాంకర్ శివ క్లోజ్‌గా ఉండటమే కారణమని చర్చ నడుస్తోంది. అనిల్ కెప్టెన్ కాబట్టి అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక సరయు విషయానికి వస్తే తొలివారం తొలి ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కిన సరయు రెండో వారంలో సేఫ్ అయిందని అంటున్నారు. యూట్యూబ్‌లో సరయు వీడియోలు చూసి ఖతర్నాక్ కిలాడీ అనుకున్న వారు ఆమె అమాయకత్వాన్ని చూసి ఓట్లు వేస్తున్నారు.

అయితే శ్రీరాపాక, మిత్రా శర్మలలో ఎవరో ఒకరే రెండో వారంలో ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీరిలో శ్రీరాపాక ఆటతీరు బాగోలేదని ఆడియన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి శ్రీరాపాక ఎలిమినేషన్ ఖాయమని అంటున్నారు. మరోవైపు శనివారం నాడు బిగ్ బాస్ ఓటీటీలో చాలా ఆసక్తి విషయాలు చోటుచేసుకున్నాయి. ముందుగా బిగ్ బాస్ ఈ వారం బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్‌లను ఎన్నుకోమని చెప్పగా.. అందరూ కలిసి నటరాజ్ మాస్టర్‌ను బెస్ట్ పెర్ఫార్మర్‌గా.. మహేష్ విట్టాను వరస్ట్ పెర్ఫార్మర్‌గా ఎన్నుకున్నారు.
Also Read: త్రివిక్రమ్ అడ్డు లేదు.. ఇక అందర్నీ వచ్చేయమంటున్నాడు
[…] Pawan Kalyan Sensational Statement: ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. ఇకమీదట ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల కష్టాలన పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రయత్నించింది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను ప్రభుత్వంపై పోరాటం చేయాలని బావించారు. […]
[…] Bheemla Nayak Box Office Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులు అవుతున్నా.. కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ చిత్రం 15 రోజుల కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి. […]