Homeఎంటర్టైన్మెంట్Krish Jagarlamudi Upcoming Movie: 7 మంది హీరోయిన్లతో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి..ఈసారి ప్లానింగ్ మామూలుగా...

Krish Jagarlamudi Upcoming Movie: 7 మంది హీరోయిన్లతో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి..ఈసారి ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Krish Jagarlamudi Upcoming Movie: సమాజం లోని సున్నితమైన అంశాలను ఎంచుకొని, వాటితో స్క్రిప్ట్స్ తయారు చేసి, సినిమాలను తెరకెక్కించడం లో క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) నేర్పరి. అందుకే ఆయన తన కెరీర్ లో అతి తక్కువ విజయాలనే చూసినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈమధ్య కాలం లో క్రిష్ కి అసలు కాలం కలిసి రావడం లేదు. ‘NTR కథానాయుడు’, ‘NTR మహానాయకుడు’ సినిమాలను బాగా తీసినప్పటికీ, ఎందుకో ఆడియన్స్ ఆ రెండు చిత్రాలను ఆదరించలేదు. ఇక ఆ తర్వాత ఆయన పంజా వైష్ణవ్ తేజ్ ని హీరో గా పెట్టి చేసిన ‘కొండపోలం’ చిత్రం ఎప్పుడు విడుదలైందో కూడా ఆడియన్స్ కి తెలియదు, అంత పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన ‘హరి హర వీరమల్లు’ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని ఆయనే తెరకెక్కించాడు. ఆ తర్వాత కూడా ఆయనే సినిమాని పూర్త చేసేసి ఉండుంటే, ఆ సినిమా ఫలితం వేరేలా ఉండేది. కానీ ఇప్పటికే నా సమయం చాలా వృధా అయ్యింది, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు, ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి, ఆ చిత్రన్ని మధ్యలోనే వదిలేసి అనుష్క తో ‘ఘాటీ’ చిత్రం చేసాడు. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇది తీయడానికి, క్రిష్ అంత పెద్ద సినిమా వదిలేసి వచ్చాడా?, కుదురుగా ఓపిక పట్టి, ఆ సినిమాని పూర్తి చేసి ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది కదా అని అంతా అనుకున్నారు. వాసవానికి క్రిష్ తెరకెక్కించిన ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ హాఫ్ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ కూడా ఆయన విజన్ కి తగ్గట్టు తీసి ఉంటే సినిమా బ్రతికేది, ఆయన కెరీర్ కూడా వేరే లెవెల్ లో ఉండేది అంటూ విశ్లేషకులు అంటున్నారు.

అయితే ‘ఘాటీ’ డిజాస్టర్ తర్వాత క్రిష్ చేయబోతున్న సినిమా ఏంటి?, అసలు సినిమాలు చేసే ఉద్దేశ్యం ఉందా?, లేదు ఆపేస్తున్నాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకున్నారు. అయితే ఆయన తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట. ఈ సినిమాలో ఏకంగా 7 మంది హీరోయిన్లు ఉంటారట. దట్టమైన అడవుల్లో, ట్రెక్కింగ్ చేసే నేపథ్యం లో ఈ చిత్రం తెరకెక్కుతుంది అట. భయంకరమైన ప్రాంతంలో ఈ 7 మంది హీరోయిన్లు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో వాళ్లకు ఎదురైనా అనుభూతులను ఒక థ్రిల్లర్ సినిమాగా తియ్యాలని చూస్తున్నాడట క్రిష్. ఆలోచన మంచిదే. మరి ఆయన ఎంచుకోబోతున్న ఆ 7 మంది హీరోయిన్లు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular