Rashmika Mandanna: ‘రష్మిక మందన్నా’ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో, భారీ రెమ్యూనిరేషన్ ఒప్పందాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇంత బిజీలోనూ కాస్త గ్యాప్ తీసుకుని ప్రేమ కథనూ సాగిస్తున్నట్టుగా ఆమె పై పుకార్లు వినిపించాయి. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ఈమె ప్రేమలో ఉందనే ప్రచారం పాతదే. అయితే వీరిద్దరూ తమ ప్రేమబంధాన్ని ధ్రువీకరించలేదు. అలా అని వీరి మధ్య ఏమి లేదు అని చెప్పడానికి లేదు.

కాకపోతే, ఇండస్ట్రీలో విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని రష్మిక గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది. అందుకే, తన అత్యంత సన్నిహితుడితో ఆమె ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఏడాది పాటు సన్నిహితంగా గడిపారనే ప్రచారమూ సాగింది. మొత్తానికి ప్రచారాల మాటలు పక్కన పెడితే.. రష్మిక వ్యవహారం పై కొత్తగా కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి.

ఓ హిందీ హీరోతో ఆమె ప్రస్తుతం సన్నిహితంగా ఉంటుందట. ఇది సీరియస్ లవ్ అట. గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టికి కూడా ప్రేమ పాఠాలు నేర్పింది. కానీ, ఆ తరవాత వీరిద్దరూ విడిపోయారు. బ్రేకప్ పుచ్చుకున్నారు. ఈ రోజుల్లో ప్రేమికులు పరస్పరం ఎందుకు బోర్ కొడతారో అర్థం కాదు, ఇదే తరహాలో రష్మిక – రక్షిత్ షెట్టి లు కూడా విడిపోయారు.

రక్షిత్ షెట్టి కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నాడు. ఎలాగూ రష్మిక కూడా కొత్త ప్రేమలతో సందడిగా గడిపేస్తోంది. ఈ రోజుల్లో సెలబ్రిటీల మధ్యన అనుబంధం ఎలా ఉందనేందుకు వారి ఇన్ స్టా పోస్టుల పరస్పర స్పందనలే పెద్ద ఆధారం చేసుకోవాలి. రష్మిక ఇన్ స్టా పోస్టులను బట్టి ఆమెకు ఎక్కువ కాలం ఏ ప్రేమ నచ్చేలా లేదు.
Also Read: Kapil Sibal: కాంగ్రెస్ కు భారీషాక్.. ఉద్దండ పిండం గుడ్ బై
Recommended videos