Mohan Babu: టాలీవుడ్ లెజెండరీ నటులలో ఒక్కరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ మరియు విలన్ రోల్స్ కి సుప్రసిద్ధమైన మోహన్ బాబు, ఆ తర్వాత హీరో గా కూడా చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి సూపర్ స్టార్స్ తో కలెక్షన్స్ లో పోటీ పడిన సినిమాలు తీసి వాళ్ళ రేంజ్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు..అందుకే అందరూ అప్పట్లో ఆయనని కలెక్షన్ కింగ్ అనే పేరు తో పిలుచుకునే వారు..విలన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి..హీరో గా కూడా టాప్ రేంజ్ కి ఎదిగిన నటులు బహుశా ఇండియా లో మోహన్ బాబు తప్ప మరొక్కరు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు..చిరంజీవి మరియు రజినీకాంత్ వంటి వారు కూడా ఇలాగె ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ కూడా మోహన్ బాబు స్థాయిలో రెగ్యులర్ విలన్స్ గా వచ్చి హీరోలు అయిన వారు కాదు..ఎదో కెరీర్ ప్రారంభం లో ఒక్కటి రెండు సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేశారు అంతే..హీరో గా విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా ఆయన ఎన్నో వందల సినిమాలు నిర్మించి భారీ విజయాలు అందుకున్నాడు.

Also Read: MLC Anantha Udaya Bhaskar: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను వైసీపీ ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు?
ఇది ఇలా ఉండగా మోహన్ బాబు డిసిప్లైన్, క్రమశిక్షణ కి మారుపేరు అనే విషయం మన అందరికి తెలిసిందే..తన సినిమాలో తప్పు జరిగితే ఎంత పెద్ద ఆర్టిస్టుని అయిన శిక్షిస్తాడు మోహన్ బాబు..అలా ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ విషయం లో కూడా జరిగింది..మోహన్ బాబు అప్పట్లో తన నిర్మాణ సంస్థలో తీసిన తప్పు చేసి పప్పు కూడు సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది..ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ని అనుకున్నారు అట మోహన్ బాబు..ఆమె కూడా మోహన్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం రావడం తో వెంటనే ఆలోచించకుండా ఓకే చెప్పేసింది..తీరా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ఆమె డేట్స్ సర్దుబాటు చెయ్యలేక, నాకు పరీక్షలు ఉన్నాయి అని చెప్పి ఈ సినిమా నుండి తప్పుకుంది..మోహన్ బాబు కూడా అది నమ్మి పెద్దగా పట్టించుకోలేదు..ఆమె స్థానం లో అప్పటి స్టార్ హీరోయిన్ గ్రీసి సింగ్ ని తీసుకున్నారు..అయితే ఆర్తి అగర్వాల్ మోహన్ బాబు కి అబద్దం చెప్పి వేరే హీరో సినిమా షూటింగ్ పాల్గొంటుంది..ఇది తెలుసుకున్న మోహన్ బాబు ఆవేశం తో ఊగిపొయ్యి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఆర్తి అగర్వాల్ పై ఫిర్యాదు చేయించి ఆమె చేత 10 లక్షల రూపాయిల జరిమానా కట్టించాడు..అప్పట్లో ఈ సంఘటన పెను దుమారమే రేపింది.

Also Read: Samantha: సమంత గ్లామర్ షో.. మత్తెక్కించింది, మతి పోగొట్టింది !
Recommended videos
[…] […]