Dhurandhar 2 Twitter Talk: దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ కాసేపటి క్రితమే ఇండియా వైడ్ గా మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కంటెంట్ ఆలస్యం అవ్వడంతో ప్రీమియర్ షోస్ రద్దు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సమయానికి షోస్ పడ్డాయి. అయితే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని అందరికంటే ముందే వీక్షించాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఈ రేంజ్ లో సినిమా ఉంటే మాత్రం కచ్చితంగా ఇది 3000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు. అయితే తరన్ ఆదర్శ్ ఈ చిత్రానికి ఏకంగా 4.5 రేటింగ్స్ ఇవ్వడమే చర్చనీయాంశంగా మారింది. సినిమా నిజంగానే ఆ రేంజ్ లో ఉందా , లేకపోతే కావాలని పైడ్ రివ్యూ ఇచ్చారా అని అంటున్నారు నెటిజెన్స్.
#OneWordReview…#DhurandharTheRevenge: MASTERPIECE.
Rating: ⭐️⭐️⭐⭐️½#Dhurandhar2 is CINEMA AT ITS BEST… Delivers on every front – scale, drama, emotions, action, performances and impact… Take a bow, #AdityaDhar – sure-shot EPIC BLOCKBUSTER. #Dhurandhar2ReviewThe… pic.twitter.com/IXP9Z36RTI
— taran adarsh (@taran_adarsh) March 18, 2026
ఆయన ఇచ్చిన రివ్యూ ప్రకారం చూస్తే ‘ధురంధర్ 2’ ఇండియన్ సినిమాకు పీక్ సినిమాటిక్ లెవెల్ అని అంటున్నాడు. సినిమా స్కేల్, డ్రామా, ఎమోషన్స్ , యాక్షన్ , నటీనటుల నటన , ఇలా ప్రతీ విభాగం లోనూ ఈ సినిమా డిస్టింక్షన్ లో పాస్ అయ్యిందని అంటున్నారు. ఆదిత్య డర్ ఇండియన్ సినిమాకు మరో ఎపిక్ బ్లాక్ బస్టర్ ని అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన్ని పొగడ్తలతో ముంచి ఎత్తాడు. సాధారణంగా 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు సహజంగానే భారీ లెవెల్ లో ఉంటాయి. కానీ డైరెక్టర్ ఆదిత్య డర్ ఆ అంచనాలను దాటేశాడు అంటూ చెప్పుకొచ్చాడు తరన్ ఆదర్శ్. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే ప్రధాన బలం అని, చాలా వేగవంతంగా ఉన్న ఈ స్క్రీన్ ప్లే లో ఆడియన్స్ కి థియేటర్స్ లో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయని అంటున్నాడు.
ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలని. చాలా ఎమోషనల్ గా , ఇంటెన్స్ గా ఉందని , హీరో రణవీర్ సింగ్ ఈ చిత్రం లో తన నటవిశ్వరూపం చూపించాడని , సంజయ్ దత్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ , అద్భుతమైన డైలాగ్ డెలివరీ తో అదరగొట్టి , ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాడని, అదే విధంగా తమిళ నటుడు రంగనాథన్ మాధవన్ పెర్ఫార్మన్స్ చాలా ఎమోషనల్ గా ఉందని అంటున్నారు. ఇక ఈ చిత్రం లో విలన్ గా నటించిన అర్జున్ రాంపాల్ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాడని. రెహ్మాన్ క్యారెక్టర్ లేని లోటుని ఆయన పూడ్చాడని అంటున్నారు.
