Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 box office collections: 12వ రోజున భారీగా పడిపోయిన 'ధురంధర్ 2' వసూళ్లు.....

Dhurandhar 2 box office collections: 12వ రోజున భారీగా పడిపోయిన ‘ధురంధర్ 2’ వసూళ్లు.. మరీ ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Dhurandhar 2 box office collections: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకు వచ్చినంత ఓపెనింగ్ వసూళ్లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏ చిత్రానికి కూడా రాలేదు. అంతే కాకుండా మొదటి వారం లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి […]

Dhurandhar 2 box office collections: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకు వచ్చినంత ఓపెనింగ్ వసూళ్లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏ చిత్రానికి కూడా రాలేదు. అంతే కాకుండా మొదటి వారం లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా జోరు మామూలు రేంజ్ లో లేదు, రాబోయే రోజుల్లో 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని అనుకున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సోమవారం రోజున ఈ చిత్రం వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి.

గత 11 రోజులుగా నాన్ స్టాప్ గా 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు 12 వ రోజున ఏకంగా 70 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. విచిత్రం ఏమిటంటే ‘ధురంధర్ ‘ చిత్రానికి రెండవ సోమవారం 29 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టగా, ‘ధురంధర్ 2 ‘ చిత్రం కేవలం 20 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. గ్రాస్ వసూళ్లు 23 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. బాషల వారీగా ఈ చిత్రం ఇండియా లో 12 వ రోజున ఎంత వసూళ్లు రాబట్టిందో వివరంగా చూద్దాం. హిందీ నుండి 23.18కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , తెలుగు వెర్షన్ నుండి 1 కోటి 35 లక్షలు, తమిళ వెర్షన్ నుండి 50 లక్షలు, కన్నడ వెర్షన్ నుండి 23 లక్షలు , మలయాళం వెర్షన్ నుండి 10 లక్షలు రాబట్టింది. ఓవరాల్ ఇండియా వైడ్ 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

Also Read: చిరంజీవి ఆ మూవీ పేరు చెబితే భయపడుతున్నాడా…

అదే విధంగా ఓవర్సీస్ నుండి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టగా , ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు వచ్చాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1430 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 , బాహుబలి 2 లను ఈ చిత్రం క్లోజింగ్ లో దాటే అవకాశాలు ఉన్నాయి కానీ, దంగల్ ని దాటడం కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే IPL సీజన్ మొదలైంది. ఆ ప్రభావం చాలా బలంగా పడనుంది. చూడాలి మరి ఎంత వరకు ఈ సినిమా రన్ ఉంటుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper