Chiranjeevi movie title controversy: మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఏ చిన్న విషయంలో తప్పు జరిగిన కూడా తను ఊరుకోడు. కాబట్టి ప్రతి దర్శకుడితో ఆయన సినిమా చేసే ముందే తనకున్న అన్ని కండిషన్స్ అయితే చెప్తారట. దానికి తగ్గట్టుగానే దర్శకుడు కూడా కథని మౌల్డ్ చేయాలని తద్వారా మేకింగ్ సమయంలో కూడా చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను చెబుతూనే తన తోటి ఆర్టిస్టులు కూడా ఎలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నారనే పూర్తి స్క్రిప్ట్ తనకి వినిపించాలి. అలా అయితేనే చిరంజీవి తన క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుంది. అది ఎంతవరకు ప్రేక్షకులకురీచ్ అవుతుందనే విషయంలో ఒక క్లారిటీకి వస్తారట. ఇక చిరంజీవి ఈ ఏజ్ లో ప్లాప్ సినిమాలు రాకూడదనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఒకవేళ ప్లాప్ వస్తే ఎలా అనే విషయాన్ని ఊహించుకోడానికి కూడా తన భయపడిపోతున్నాడు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి చిరంజీవి సైతం తన ఎంటైర్ కెరియర్ లో భారీ సక్సెస్ లను సాధించాడు. అలాగే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను కూడా చేశాడు. అలాంటి చిరంజీవి చిన్న చిన్న ప్లాప్ లకు కృంగిపోతాడు అనుకోవడం కరెక్ట్ కాదంటూ మరి కొంతమంది మెగా అభిమానులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…
Also Read: డైరెక్టర్ బాబీ చిరంజీవి తో చేస్తున్న సినిమాకి ఆ ఒక్కటే మైనస్ అవుతుంది…
ఇక చిరంజీవి రీసెంట్ గా ‘మన శంకర్ ప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. కానీ విశంభర రిజల్ట్ ఎలా ఉండబోతుందనే విషయంలో ఆయన చాలావరకు భయపడిపోతున్నాడట. సినిమా కథ ఓకే అయినప్పటికి సీజీ షాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవి అనుకున్నంత పర్ఫెక్ట్ గా రాలేదట.
దానివల్ల సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని చిరంజీవి అనుకుంటున్నాడట. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే గాని సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది చెప్పడం కష్టమవుతుంది…ఇక ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా కోసం సిద్ధమవుతున్నాడు…