Homeఎంటర్టైన్మెంట్Dhanush Son Debut: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో 'ధనుష్' కొడుకు.. మొదటి సినిమా దర్శకుడు...

Dhanush Son Debut: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో ‘ధనుష్’ కొడుకు.. మొదటి సినిమా దర్శకుడు ఎవరంటే..

Dhanush Son Debut: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా తమిళ హీరో ధనుష్ పేరు ఉంటుంది. తెలుగు , తమిళం హిందీ , మలయాళం , ఇలా అన్ని భాషల్లోనూ ఈయన సూపర్ హిట్స్ ని అందుకొని పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా నిలిచాడు. అంతే కాదు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. ఈయన టాలెంట్ ని చూసి హాలీవుడ్ సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయంటే ధనుష్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు లో కూడా ఈయనకు ‘సార్’, ‘కుబేర ‘ వంటి హిట్స్ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ధనుష్ కి ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక కొడుకు పేరు యాత్ర రాజా , మరో కొడుకు పేరు లింగా.

వీళ్ళిద్దరిలో యాత్ర రాజా ఇప్పుడు సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు , ధనుష్ యే అట. తన కొడుకుని స్వయంగా తానే లాంచ్ చెయ్యాలని చూస్తున్నాడు. అయితే ధనుష్ కి దర్శకత్వం వహించడం ఇదేమి కొత్త కాదు. గతం లో ‘రాయన్’ అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా ఆయన కొత్తవాళ్ళని ఇండస్ట్రీ కి పరిచయం చేయడం విశేషం. అలా దర్శకుడిగా తనని తానూ నిరూపించుకున్న ధనుష్ , ఇప్పుడు తన సొంత కొడుకుని ఇండస్ట్రీ కి తన దర్శకత్వం లో తెరకెక్కించే సినిమా ద్వారా హీరో గా పరిచయం చేయబోతున్నాడు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

యాత్ర రాజా కేవలం ధనుష్ కొడుకు మాత్రమే కాదు , సూపర్ స్టార్ రజనీకాంత్ మేనల్లుడు కూడా . రజినీకాంత్ లేజసీ ని భవిష్యత్తులో మోసే బాధ్యత యాత్ర పైనే ఉంటుంది. చూసేందుకు గొప్ప అందగాడు కాకపోయినా, ముఖం లో హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సరైన సినిమాలు పడితే చాలు , ఇతను ధనుష్ రేంజ్ హీరో గా భవిష్యత్తులో ఒక వెలుగు వెలుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం అబ్దుల్ కలాం బయోపిక్ లో , అదే విధంగా మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ధనుష్ తన కొడుకు సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.