spot_img
Home ఆంధ్రప్రదేశ్‌ Thammineni Sitaram: ‘లాజిక్’ తో కొడుతున్న తమ్మినేని!

Thammineni Sitaram: ‘లాజిక్’ తో కొడుతున్న తమ్మినేని!

Thammineni Sitaram

Thammineni Sitaram: ఏపీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఓ భూ యజమాని బతికి ఉండగానే ఆయన వారసుల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. తమ్మినేని కుమారుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అనేది ప్రధాన ఆరోపణ. దీనిపై పోలీసులు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో జిల్లా ఎస్పీ నేరుగా పర్యవేక్షించారు. ఇదంతా తమ్మినేని అధికార దర్పంతో చేయించుకున్న పనిగా నిర్ధారించారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న తమ్మినేని సీతారాం ఫ్యామిలీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసింది. అయితే కోర్టు తమ్మినేని తో పాటు ఆయన భార్య వాణికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. కానీ ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ కు మాత్రం ముందస్తు బెయిల్ లభించలేదు. మరోవైపు తమ్మినేని తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ తప్పు లేదని తేల్చేశారు.

* నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమి..
శ్రీకాకుళం నగరంలో ఓ వ్యక్తి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమి ఉంది. అయితే ఆ భూ యజమాని బతికి ఉండగానే.. ఆయన కుమార్తె పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. అదే పేరుతో ఉన్న ఓ మహిళను ఒడిస్సా నుంచి తెప్పించి.. ఆమె పేరుతో పత్రాలు సృష్టించి.. తమ్మినేని కుమారుడు పేరుతో ఆ భూమిని విక్రయించారు. సాక్షులుగా తమ్మినేని కాలేజీలో పని చేస్తున్న సిబ్బందిని చూపించారు. అయితే ఇటీవల ఆ భూమికి ఫెన్సింగ్ వేసిన క్రమంలోనే అసలైన బాధితులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో అసలు విషయం తెలిసింది. తమ్మినేని ఫ్యామిలీ పై కేసు నమోదు చేశారు. అయితే తమ్మినేని దంపతులు ముందస్తు బెయిల్ పొందగలిగారు. కుమార్ రెడ్డికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు.

* కొత్త వాదన..
అయితే ఇప్పుడు తమ్మినేని కొత్త వాదనకు తెర తీశారు. తాము బాధితులమని చెబుతున్నారు. నకిలీ ధ్రుపత్రాల తయారు చేసింది తాము కాదని.. అలా వారు మోసం చేశారని.. అధికారులు సరిగ్గా పరిశీలించలేదని కొత్త వాదనను ముందుకు తెచ్చారు. అచ్చం చిన్నప్పుడు పిల్లల చాక్లెట్ తగాదా మాదిరిగా.. ఈ మొత్తం ఘటనను పాత్రదారులపై తోసే ప్రయత్నం చేశారు. అయితే ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా వ్యవహరించిన తమ్మినేని చిన్న లాజిక్ మరిచారు. నాలుగు కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినప్పుడు.. ఆ భూమి పత్రాలు సరైనవా? అసలు ఆయన అసలు యజమానియేనా? అని ఆరా తీసుకోకుండా కోట్లాది రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేశారు అంటే.. లెక్కకు మించి సొమ్మైనా ఉండాలి. కోట్ల రూపాయల విలువైన దానం అంటే లెక్కలేని తనమైనా ఉండాలి. అయితే ఈ లాజిక్కు మాట్లాడడం తమ్మినేని తిమ్మిని బమ్మిని చేయగలరు అని అర్థం అయింది.

Exit mobile version