Suriya Veerabhadrudu review : సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సౌత్ లో మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరో సూర్య. ఇప్పుడైతే విజయ్ సౌత్ లో రజినీకాంత్ రేంజ్ కి వచ్చేశాడు కానీ , 2020 కి ముందు సౌత్ లో సూర్య కి ఉన్నంత మార్కెట్ విజయ్ , అజిత్ వంటి వారికి ఉండేది కాదు. 2015 లోనే తెలుగు రాష్ట్రాల నుండి 50 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన సత్తా ఉన్న హీరో సూర్య. కానీ ఈమధ్య కాలం లో ఆయనకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన కంగువ దారుణ పరాజయం గా నిలిస్తే, కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే హ్మణాల నడుమ విడుదలైన ‘రెట్రో ‘ ఇంకా పెద్ద ఫ్లాప్ గా నిల్చింది. తమిళనాడు లో నిన్నగాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చినటువంటి ప్రదీప్ రంగనాథన్ వంటి వారు కూడా సూర్య ని దాటేశారు.
ఇది ఆయన అభిమానులకు ఘోర అవమానం అనే చెప్పాలి. అయితే ఇప్పుడు సూర్య ఈ నెల 14 న ‘కరుప్పు’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేడియో బాలాజీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో త్రిష హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమా ‘వీరభధ్రుడు’ అనే టైటిల్ తో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై అటు తమిళం లో కానీ , ఇటు తెలుగు లో కానీ ఎలాంటి అంచనాలు లేవు. రీసెంట్ గానే తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు , చాలా బలహీనంగా ఉన్నాయి. సూర్య సినిమాకు ఇంత వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈమధ్య కాలం lo ఏ సినిమాకు జరగలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అది కాసేపు పక్కన పెడితే నిన్న చెన్నై లో ee చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రదర్శించారు.
ఈ షోకి పలువురు సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా, మీడియా రిపోర్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళ నుండి ఈ సినిమాకు వచ్చిన టాక్ ఏమిటంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంటెన్స్ డ్రామా తో ఈమధ్య కాలంలో సూర్య కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించేలా ఉందని , సెకండ్ హాఫ్ లో కాస్త ఎమోషనల్ డ్రామా ఉన్నప్పటికీ, బాగా ల్యాగ్ చేశారని క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఆడియన్స్ కి ఇది నచ్చుతుందో లేదో చూడాలి. ఇకపోతే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇది ఎలా ఉందో చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
