Thammineni: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళం జిల్లా నేతలు చికాకు పెడుతున్నారు. ఆ పార్టీకి ఈ జిల్లాలో నేతలు ఎక్కువ. మరోవైపు అందరూ సీనియర్లే. ధర్మాన బ్రదర్స్ తో పాటు తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి అప్పలరాజు వంటి వారు ఉన్నారు. అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ ను ఎంతగానో నమ్మారు జగన్. ఆయన సైతం సీనియర్ల జాబితాలోనే ఉన్నారు. కానీ కుటుంబ వ్యవహారంతో పార్టీ ఆయన పై వేటు వేసింది. కుమారుడు బైక్ ప్రమాదం కారణంగా అప్పలరాజు అరెస్టయ్యారు. అయితే కుమారుడు పేరుతో బతికున్న ఓ కుటుంబ యజమాని వారసుల పేరుతో నాలుగు కోట్ల రూపాయల భూమిని రాయించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కుటుంబంతో సహా పరారయ్యారు. ఇప్పుడు కోర్టులో ముందస్తు బెయిల్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తమ్మినేనిని కాకుండా.. జగన్మోహన్ రెడ్డి అప్పలరాజును పర్యటించేందుకు వస్తుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* ఇప్పటికే ఒక నిర్ణయానికి..
అయితే తమ్మినేని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తమ్మినేని టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ శాసనసభ స్పీకర్ గా ఉన్న తమ్మినేనికి టికెట్ ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి అప్పట్లో టిక్కెట్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత తమ్మినేనికి ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. ఎలాగైనా తమ్మినేని వదిలించుకునేందుకు జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతుంది.
* కచ్చితంగా రియాక్ట్..
అయితే తమ్మినేని కి ప్రత్యామ్నాయం లేదు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో గొడవ పెట్టుకునే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఉన్న ఏకైక మార్గం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడం. అది లేకుంటే పార్టీకి పనిచేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు తమ్మినేని. ఈ కారణం పెట్టి తమ్మినేనిని పట్టించుకోవడం లేదు జగన్. పార్టీలో ఉంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోండి అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. అందుకే శ్రీకాకుళం జిల్లాలో మరో మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు వస్తున్న జగన్.. తమ్మినేని విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో తమ్మినేనికి సైతం ఒక క్లారిటీ వస్తుంది. అందుకే ఈ కేసు నుంచి బయటపడిన తర్వాత తమ్మినేని సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు. అప్పలరాజును పరామర్శించి తనను పరామర్శించకపోతే మాత్రం తమ్మినేని విశ్వరూపం చూపే అవకాశం ఉంది.
