Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Kamal Haasan Multistarrer: రజినీకాంత్,కమల్ హాసన్ మల్టీస్టారర్ లో విలన్ గా పాన్ ఇండియన్...

Rajinikanth Kamal Haasan Multistarrer: రజినీకాంత్,కమల్ హాసన్ మల్టీస్టారర్ లో విలన్ గా పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్..

Rajinikanth Kamal Haasan Multistarrer: తెలుగు ఆడియన్స్ తో పాటు , అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ కోరుకునే కొన్ని అరుదైన కాంబినేషన్ సినిమాలు ఉంటాయి. వాటిల్లో రజనీకాంత్(Superstar Rajinikanth) , కమల్ హాసన్(Kamal Hassan) మల్టీస్టార్రర్ సినిమా కూడా ఒకటి. కెరీర్ ప్రారంభం లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కమల్ హాసన్ హీరో గా నటిస్తే , అందులో రజినీకాంత్ విలన్ గా నటించేవాడు. ఆ తర్వాత రజినీకాంత్ సోలో హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యి, పెద్ద స్టార్ రేంజ్ కి ఎదిగిన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. సందర్భం వచ్చినప్పుడు ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ కలిసి మాత్రం గత 40 ఏళ్ళల్లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు మల్టీస్టార్రర్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.

‘జైలర్’ సిరీస్ కి దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రకటన కొన్ని రోజుల క్రితమే ఒక స్పెషల్ వీడియో ద్వారా గ్రాండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ కోసం ఒక పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ని ఎంచుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి . ఆ పాన్ ఇండియన్ డైరెక్టర్ మరెవరో కాదు , శంకర్ అట. ఈయన గతం లో సూపర్ స్టార్ రజినీకాంత్ ని హీరో గా పెట్టి శివాజీ , రోబో, ‘2 పాయింట్ O’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందించాడు. అదే విధంగా కమల్ హాసన్ తో ‘ఇండియన్ / భారతీయుడు’ వంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాడు. అలా ఇద్దరి హీరోలకు ఎంతో ఆప్తుడు అయినటువంటి శంకర్ , ఈ క్రేజీ చిత్రం ద్వారా నటుడిగా వెండితెర అరంగేట్రం చేయబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

డైరెక్టర్ గా ఈమధ్య కాలం లో శంకర్ కి ఏది సరిగా కలిసిరావడం లేదు. ఒకప్పుడు రాజమౌళి ని మించిన డైరెక్టర్. మన సౌత్ నుండి 30 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని వరుసగా షేక్ చేస్తూ వచ్చిన లెజెండ్ ఆయన. ‘2 పాయింట్ O ‘ వరకు అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆయన , ఆ తర్వాత కమల్ హాసన్ తో తీసిన ‘ఇండియన్ 2’ తో మొట్టమొదటి ఘోరమైన డిజాస్టర్ ని అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన రామ్ చరణ్ తో చేసిన పొలిటికల్ మూవీ ‘గేమ్ చేంజర్ ‘ కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో శంకర్ సినీ భవిష్యత్తు ఏంటి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలాంటి క్రేజీ మల్టీస్టార్రర్ లో విలన్ గా తన కెరీర్ ని పునః ప్రారంభించాలని అనుకోవడం చాలా పెద్ద నిర్ణయమే, మరి ఆయన నటుడిగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version