Homeజాతీయ వార్తలుTrisha Vijay relationship news : మరో జయలలిత అవుతుందనుకుంటే.. పుట్టినరోజు నాడు త్రిష ఇలా...

Trisha Vijay relationship news : మరో జయలలిత అవుతుందనుకుంటే.. పుట్టినరోజు నాడు త్రిష ఇలా చేసిందేంటి..

Trisha Vijay relationship news : అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. త్రిష, విజయ్ రిలేషన్ ఓపెన్ సీక్రెట్. కలిసి ఉంటున్నారు. కలిసి వివాహాలకు వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం లీయో అనే సినిమాలో కూడా నటించారు. ఆ సినిమాలో భార్యాభర్తలు గా నటించారు అనేకంటే జీవించారు అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు విజయ్, త్రిష హింట్ ఇస్తూనే ఉన్నారు. పాపం పిచ్చి ప్రేక్షకులకే అర్థం కాలేదు.

తమిళనాడు ఎన్నికల్లో త్రిష ఓపెన్ గానే చెప్పేసింది. తన ఇల్లు మరో పవర్ హౌస్ అవుతుందని. తమిళనాడులో సినీ తారలు పవర్ హౌస్ కేంద్రాలుగా ఏర్పాటు కావడం కొత్తేమీ కాదు. గతంలో జయలలిత ఏ స్థాయిలో తన సత్తా చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దశలో ఎంజీఆర్ మాటకంటే.. జయలలిత మాట కు ఎక్కువ విలువ ఉండేది. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లోనే తాను ఒక అమ్మగా మారిపోయింది. తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు త్రిష అదే స్థాయికి వెళ్తుందా.. అంత సన్నివేశం ఆమెకు ఉందా అనే విషయాలను పక్కన పెడితే.. త్రిష వేస్తున్న అడుగులు అలానే ఉన్నాయి.

విజయ్ పూర్తిగా త్రిషకు సరెండర్ అయిపోయాడు. అందులో అనుమానం లేదు. ఆమధ్య ఆమిత్ షా అని కూడా త్రిష కలిసినట్టు వార్తలు వచ్చాయి. త్రిష కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. ఓ ఇంటర్వ్యూలో తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని చెప్పింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఆమె అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. త్రిష నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నది.. సోషల్ మీడియాలో ఆమె గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. హైవే మీద తిరుపతి సైన్ బోర్డు చూపిస్తూ త్రిష ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. వాస్తవానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలవుతున్నాయి. త్రిష తమిళనాడులో ఉంటుంది అనుకుంటే.. ఆమె తిరుపతి చెక్కేసింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళింది.

విజయ్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంటాడు. అలాంటప్పుడు త్రిష సాంగత్యం అతడికి అవసరం. కానీ ఆమె తన పుట్టినరోజు కాబట్టి తిరుపతి వెళ్ళింది. ఈ రకంగా టీవీ కే పార్టీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా ఆమెకు నమ్మకం ఉందా.. అందువల్లే ఒత్తిడి మొత్తాన్ని పక్కనపెట్టి తిరుపతి వెళ్లిందా.. తిరుపతి వెళ్లి వచ్చిన తర్వాత గుడ్ న్యూస్ చెబుతుందా.. విజయ్ ముఖ్యమంత్రి అయితే.. తన కచ్చితంగా పవర్ హౌస్.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు .. ఇదిగో ఇలా సాగిపోతున్నాయి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు.. ఏది ఏమైనా సరే 43 సంవత్సరాల వయసులో కూడా త్రిష పాతికేళ్ల పడుచు లాగానే కనిపిస్తోంది.. ఇదంతా ఏ మహత్యమో తెలియదు కానీ.. తమిళ ప్రజలు నెత్తిన పెట్టుకుంటే త్రిష మరో అమ్మ కాకుండా పోదు.. ఆల్రెడీ విజయ్ అయ్య అయిపోయాడు మరి..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version