spot_img
Home క్రీడలు క్రికెట్‌ Ishan Kishan: వైభవ్ సూర్య వంశీ కాదు.. టీ20లలో ఇతడే తోపు..

Ishan Kishan: వైభవ్ సూర్య వంశీ కాదు.. టీ20లలో ఇతడే తోపు..

Ishan Kishan

Ishan Kishan: ఇటీవల జింబాబ్వే సిరీస్ లో మొదటి మ్యాచ్.. మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీలు చేశాడు వైభవ్ సూర్య వంశీ. ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు దూకుడైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. సిసలైన బ్యాటింగ్ తో సత్తా చూపిస్తున్నాడు. కేవలం టి20 లోనే కాదు, సూర్యవంశీ ఐపీఎల్ లో కూడా అదరగొట్టాడు. ఏకంగా ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

వైభవ్ ఈ స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. టి20లలో అతనికి మించి ఆడుతున్నాడు ఈ ఇండియన్ క్రికెటర్. పరుగుల వరద పారిస్తూ సత్తా చూపిస్తున్నాడు. దాదాపు రెండేళ్ల కాలం వరకు జట్టుకు దూరంగా ఉన్న అతడు.. తన ప్రతిభ ద్వారా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. తిరుగులేని స్థాయి ఆటను కొనసాగిస్తూ అదరగొడుతున్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు టి20 లలో టీమ్ ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆవిర్భవించాడు. అతడు మరెవరో కాదు ఈశాన్ కిషన్.

ఈశాన్ కిషన్ అద్భుతమైన ఆటగాడు. కాకపోతే స్థిరమైన ప్రదర్శన చేయలేకపోవడంతో జట్టులో సుస్థిర స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. కొన్ని సందర్భాలలో క్రమశిక్షణను కోల్పోవడంతో జట్టుకు దూరం కావలసి వచ్చింది. చివరికి అనేక ఇబ్బందులు పడి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున సత్తా చూపించాడు. భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో కూడా అదరగొట్టాడు. అతడి ఫామ్ పడుతూ లేస్తూ సాగుతున్నప్పటికీ.. ఈ ఏడాది టి20 ఫార్మేట్ లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఈశాన్ కిషన్ నిలిచాడు.

సరిగ్గా 2022లో టీ మీడియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 1164 పరుగులు చేశాడు. 2025లో అభిషేక్ శర్మ ఏకంగా 859 పరుగులు చేశాడు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు కిషన్ కిషన్ 812 పరుగులు చేశాడు. ప్రస్తుతం టి20 ఫార్మాట్ లో అగ్రశ్రేణి బ్యాటర్ల జాబితాలో కిషన్ ముందు వరుసలో కొనసాగుతున్నాడు. అతడు తన జోరు ఇలానే కొనసాగిస్తే.. తొలి వరసస్థానాన్ని చాలా రోజుల వరకు ఆక్రమించే అవకాశం ఉంది.

సూర్య వంశీ నుంచి ముప్పు పొంచి ఉంది కాబట్టి కిషన్ జాగ్రత్త పడాలి. పైగా కిషన్ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన ఆటగాడు. సూర్య వంశీ.. కిషన్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల కాలంలో వారిద్దరు అద్భుతమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. సూర్య వంశీ కిషన్ ను బాయ్ అని సంబోధిస్తాడు. పైగా ఇటీవల ఇంటర్వ్యూలో కూడా తనకు ఇషాన్ ఎక్కువ ప్రోత్సాహం అందిస్తున్నాడని.. తన వృద్దిలో అతడి పాత్ర కీలకమని సూర్యవంశీ పేర్కొన్నాడు.

Exit mobile version