Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రం, బంపర్ ఓపెనింగ్ వసూళ్లను అందుకుంది. అదే జోరుని వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగిస్తూ ప్రామిసింగ్ లాంగ్ రన్ ని సూచించింది. 10 వ రోజున (ఆదివారం) ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావడం తో, కాస్త నిరాశకు గురయ్యారు అభిమానులు. ఎందుకంటే 2 కోట్ల షేర్ ని ఆరోజున వస్తుందని ఊహించారు. కానీ రేంజ్ లో రాకపోవడం తో , ఇక రన్ ముగిసినట్టే అని అనుకున్నారు. కానీ 11 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇది చాలా డీసెంట్ అనే చెప్పాలి. దీంతో ఈ సినిమా రన్ ఈ వీకెండ్ కూడా బలంగా ఉంటుందనే నమ్మకం అందరిలోనూ కలిగింది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 12 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 3 కోట్ల 60 లక్షలు , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 3 కోట్ల 85 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 44 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 53 లక్షలు , గుంటూరు నుండి 2 కోట్ల 21 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 1 కోటి 69 లక్షలు , నెల్లూరు నుండి 1 కోటి 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 49 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.
ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 76 లక్షల రూపాయిలు రాగా, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 35 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 65 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి క్లోజింగ్ లో 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. కానీ అక్కినేని ఫ్యాన్స్ కలగన్న 100 కోట్ల గ్రాస్ మాత్రం ఈ చిత్రం తో కష్టమే.







