Homeఎంటర్టైన్మెంట్Nagarjuna photos misuse case: నాగార్జున ఫోటోలను వాడుకున్నందుకు ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం.. అసలు...

Nagarjuna photos misuse case: నాగార్జున ఫోటోలను వాడుకున్నందుకు ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం.. అసలు ఏమైందంటే..

Nagarjuna photos misuse case: అక్కినేని నాగార్జున పేరు ని, ఫోటోలను టీ షర్ట్స్ మీద వాడుకోవడం పై ఢిల్లీ హై కోర్టు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. రీసెంట్ గానే ఆయన తన అనుమతి లేకుండా ఫోటోలను , పేరు ని వాడుకుంటున్నారని , నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని హై కోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన జస్టీస్ తుషార్ రావు ధర్మాసనం విచారణ చేపట్టి, సదరు వ్యాపారిని […]

Nagarjuna photos misuse case: అక్కినేని నాగార్జున పేరు ని, ఫోటోలను టీ షర్ట్స్ మీద వాడుకోవడం పై ఢిల్లీ హై కోర్టు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. రీసెంట్ గానే ఆయన తన అనుమతి లేకుండా ఫోటోలను , పేరు ని వాడుకుంటున్నారని , నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని హై కోర్టు లో పిటీషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన జస్టీస్ తుషార్ రావు ధర్మాసనం విచారణ చేపట్టి, సదరు వ్యాపారిని ప్రశ్నిస్తూ , నాగార్జున ఫోటోలను వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారని నిలదీసింది. దీనికి వ్యాపారట తరుపున న్యావాడి శృతి అయ్యర్ తన వాదనలు వినిపిస్తూ ‘అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రానికి నా క్లయింట్ మర్చండైజ్ కి అధికారిక భాగస్వామి. కాబట్టి తన క్లయింట్ ని ఈ కేసు నుండి తప్పించాల్సిందిగా అభ్యర్దిస్తున్నాను’ అంటూ తమ వాదనని వినిపించారు.

ఒక ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా తమ ప్రొడక్షన్ హౌస్ తో ఒప్పందం ఉందని , అప్పట్లో అక్కినేని నాగార్జున గారే స్వయంగా ప్రమోట్ చేసారని చెప్పుకొచ్చారు. దీనిపై నాగార్జున తరుపున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చివరికి ఆ వ్యాపారి తనకు కానీ , ఆ నిర్మాణ సంస్థతో కానీ అటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని న్యాయస్థానం ముందు అంగీకరించాల్సి వచ్చింది. దీంతో ఈ వాదనలపై హై కోర్టు చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. స్వయంగా ఈ వ్యాపారి తమకు ఆ నిర్మాణ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు, నాగార్జున ఫోటోలను అతని టీ షర్ట్స్ పై వాడుకునే అధికారం ఎవరిచ్చారు అని హై కోర్టు ప్రశ్నించగా, వ్యాపారి కి సంబంధించిన న్యాయవాది మాట్లాడుతూ ‘వాల్స్ & ట్రెండ్స్ సంస్థ తమ కంపెనీ ని నియమించుకుంది , దానికి ప్రొడక్షన్ హౌస్ తో కూడా ఒప్పందం జరిగిందని , కాస్త సమయం ఇస్తే ఆధారాలతో సహా మీ ముందుకొస్తానని చెప్పడం , హై కోర్టు ఈ కేసుని ఆగస్టు 3 కి వాయిదా వేసింది.

దీంతో ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గతం లో అక్కినేని నాగార్జున తన వ్యక్తి గత వివరాలకు భద్రతా కల్పించాలని ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో హై కోర్టు నాగార్జున వివరాలకు వ్యక్తిగత భద్రతని కల్పిస్తూ, ఎవ్వరూ కూడా నాగార్జున అనుమతి లేకుండా, ఆయన ఫోటోలను, పేర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని , అలా చేస్తే చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని తీర్పుని ఇచ్చింది. ఇప్పుడు నాగార్జున అనుమతి లేకుండా ఆ ఫోటోలను ఒక వ్యాపారి వాడుకోవడం తో హై కోర్టు ఆ వ్యాపారిని మందలించింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper