Jabardasth completes 700 episodes: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్(Jabardasth Comedy Show) అనే కామెడీ షో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెర హిస్టరీ లోనే జబర్దస్త్ ఒక చరిత్ర. ఈ షో ని ప్రేరణగా తీసుకొని ఇతర టీవీ చానెల్స్ లో కూడా ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అలాంటి సెన్సేషనల్ కామెడీ షో ప్రారంభమై 12 ఏళ్ళు అయ్యింది. ప్రతీ వారం గురు, శుక్రవారాల్లో టెలికాస్ట్ అయ్యే ఈ బిగ్గెస్ట్ కామెడీ షో, ప్రస్తుతం శుక్ర, శనివారాల్లో టెలికాస్ట్ అవుతుంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను,చమ్మక్ చంద్ర, షకలక శంకర్, ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది కమెడియన్స్ ఈ షో ద్వారానే పుట్టుకొచ్చారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 కమెడియన్ గా కొనసాగుతున్న సత్య కూడా ఈ కామెడీ షో ద్వారా వచ్చిన వాడే. ఈ షో అంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణాలలో నాగబాబు(Nagababu Konidela), రోజా(Roja Selvamani) ఒకరు. వీళ్లిద్దరు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి షో కి ఒక హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నాగబాబు కి ఈ షో అద్బుతమగా కలిసొచ్చింది. ఇక రోజా కి కూడా కెరీర్ పరంగా ఈ షో ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అనసూయ కూడా ఈ షో ద్వారానే పరిచయం అయ్యింది. అదే విధంగా యాంకర్ రష్మీ కి కూడా ఈ షో ద్వారా కెరీర్ వచ్చింది. ఇప్పటికీ ఆమె ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూనే ఉంది.
Also Read: కింగ్డమ్’ మరోసారి వాయిదా పడబోతోందా..? కారణాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
12 ఏళ్లుగా 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ వారు జబర్దస్త్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి నాగబాబు విచ్చేశాడు. ఇప్పటి వరకు జబర్దస్త్ లో కొనసాగిన కమెడియన్స్ అందరూ హాజరు అయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాళ్ళు, సినిమాలో బిజీ అయ్యి ప్రస్తుతానికి ఈ షోలో కొనసాగని వాళ్ళు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే సుడిగాలి సుధీర్ ఈ ఈవెంట్ కి రాకపోవడం గమనార్హం. అంతే కాకుండా రోజా కూడా ఈ ఈవెంట్ లో మిస్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రోజా ఎందుకు రాలేదు?, నాగబాబు ఉన్నాడని రాలేదా?, ఈ ఇరువురు ఇప్పుడు వేర్వేరు పార్టీలలో ఉన్నారు, వీళ్ళ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈటీవీ వారు ఆమెని ఆహ్వానించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ని క్రింద అందిస్తున్నాము,చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.