Jayam : బుల్లితెర పై స్టార్ యాంకర్ గా అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకున్న వారిలో ఒకరు రష్మీ గౌతమ్(Rashmi Gautam). కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ని చేసుకుంటూ వచ్చిన ఈ యాంకర్ కెరీర్ ని ‘జబర్దస్త్'(Jabardasth Comedy Show) కామెడీ షో ఒక మలుపు తిప్పింది. జబర్దస్త్ లో ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు, వెళ్లిపోయారు కానీ, రష్మీ మాత్రం ప్రారంభం నుండి నేటి వరకు యాంకర్ గా ఆ షోకి కొనసాగుతూనే ఉంది. ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ముఖ్యంగా ఈమె హీరోయిన్ గా నటించిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈమె అందానికి, యాక్టింగ్ టాలెంట్ కి తగ్గట్టుగా గుర్తింపు రాలేదని ఆమెని అభిమానించే వారు అంటూ ఉంటారు.
Also Read : జయం సినిమాని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..? చేసి ఉంటే ఆయన రేంజ్ ఇంకా ఎలా ఉండేదో!
నిన్న ఈటీవీ ఛానల్ లో జరిగిన ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. నితిన్(Hero Nithin) ఈ ఈవెంట్ కి ఒక ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా మొదటి చిత్రం జయం లో రష్మిక తో దాదాపుగా 90 శాతం సన్నివేశాలు కలిసి రిహార్సల్స్ చేశాను. హీరోయిన్ ఈమెనే అని అనుకున్నాను. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ మార్చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు.’జయం'(Jayam Movie) చిత్రం అప్పట్లో ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ ని నెలకొల్పి ఏడాదికి పైగా థియేటర్స్ లో ప్రదర్శించబడింది. అలాంటి సూపర్ హిట్ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం కోల్పోవడం అనేది మామూలు బ్యాడ్ లక్ కాదు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సదా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.
సదా స్థానంలో రష్మీ ఉంటే అదే స్థాయికి వెళ్లి ఉండేది కదా, పాపం రష్మీ బ్యాడ్ లక్ మాములుగా లేదని సోషల్ మీడియా లో ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ చేతిలో ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోస్ కి మాత్రమే యాంకర్ గా చేస్తుంది. ఈ రెండు షోస్ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమా కూడా లేదు. మరోపక్క ఈమెతో పాటు కెరీర్ ని మొదలు పెట్టిన అనసూయ వంటి వారు పాన్ ఇండియా రేంజ్ లో నటిగా గుర్తింపు ని తెచ్చుకొని ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది. కానీ రష్మీ మాత్రం ఇంకా జబర్దస్త్ వద్దనే ఆగిపోయింది. భవిష్యత్తులో ఆయినా ఆమె ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటుందో లేదో చూడాలి.
Also Read : రివ్యూ : జయమ్మ పంచాయితీ