Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో షో పై బలమైన ప్రభావం చూపించిన కంటెస్టెంట్స్ లో ఒకరు షాలిని. మొదటి నాలుగు వారాలు మంచి గ్రాఫ్ తో దూసుకుపోయింది కానీ , ఆ తర్వాత రోహిత్ తో లవ్ ట్రాక్ కారణంగా బాగా వెనుకబడిపోయింది. ఫలితంగా గత వీకెండ్ ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే షాలిని లేకపోతే షో లో మజా ఉండదు అనే కారణంతో ఆమెని సీక్రెట్ రూమ్ లో పెట్టారు. నిన్న రాత్రి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె సడన్ గా రీ ఎంట్రీ ఇవ్వగానే రోహిత్ షాక్ కి గురై పరుగులు తీసాడు, ఆ తర్వాత షాలిని ని గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు అమర ప్రేమికులు చాలా రోజుల తర్వాత కలుసుకుంటే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో, అలాంటి రియాక్షన్ నిన్న వీళ్లిద్దరు రీ క్రియేట్ చేశారు.
ఆ తర్వాత వీళ్లిద్దరు చాలా సేపు ముచ్చట్లు పెట్టుకున్నారు , అనేక సార్లు హగ్ కూడా చేసుకున్నారు. ఇది చూసేవాళ్లకు కొంతమందికి చిరాకు గా అనిపించింది . ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇదేమి కర్మరా బాబు అని అనిపించక తప్పదు. కానీ మొదట్లో వీళ్ళ లవ్ ట్రాక్ పై సోషల్ మీడియా లో ఉన్నంత నెగటివిటీ ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్లిద్దరు కేవలం కంటెంట్ కోసం లవ్ ట్రాక్ నడపడం లేదు , వీళ్ళ మధ్య రిలేషన్ ఆర్గానిక్ గానే ఏర్పడింది అని నమ్ముతున్నారు. అందుకే ఈమధ్య వీళ్ళ రిలేషన్ పై పాజిటివ్ రియాక్షన్స్ సోషల్ మీడియా లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే షాలిని మాత్రం తన గేమ్ ని ఎంతో కొంత మార్చే ప్రయత్నం అయితే చాలా బలంగానే చేస్తోంది.
సీక్రెట్ రూమ్ కి వెళ్ళకముందు ఈమె ఎక్కువగా రోహిత్ తోనే ఉండేది. కానీ సీక్రెట్ రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అందరి కంటెస్టెంట్స్ తో బాగా కలిసిపోతుంది. ముఖ్యంగా ఈమెకు నీతూ మాస్టర్ తో గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆమెతో చాలా స్నేహంగా ఉంటుంది. చూస్తుంటే తనకు వచినటువంటి ఈ రెండవ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. కానీ కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. టాస్క్ లో ఈమె దక్షి మీదకు దూసుకెళ్లడమే కాకుండా, ఆమెపై ఫిజికల్ దాడి కూడా చేసింది. దీనిపై నాగార్జున ఈ వీకెండ్ లో ఫుల్ కోటింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.