Homeఎంటర్టైన్మెంట్Court Movie Remake Heroine Devayani Daughter: 'కోర్ట్' మూవీ రీమేక్ లో హీరోయిన్ గా...

Court Movie Remake Heroine Devayani Daughter: ‘కోర్ట్’ మూవీ రీమేక్ లో హీరోయిన్ గా దేవయాని కూతురు.. ఎంత అందంగా ఉందో మీరే చూడండి.

Court Movie Remake Heroine Devayani Daughter: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్’ చిత్రం గత ఏడాది ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన రెండు మూడు సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళం లో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ దేవయాని కూతురు ప్రియాంక ఈ […]

Court Movie Remake Heroine Devayani Daughter: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్’ చిత్రం గత ఏడాది ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన రెండు మూడు సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళం లో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ దేవయాని కూతురు ప్రియాంక ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించబోతుంది. దేవయాని అంటే ఈ జనరేషన్ జనాలకు తెలియకపోవచ్చు. ఆమె తమిళం లో ఒక టాప్ మోస్ట్ హీరోయిన్. మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సుస్వాగతం’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘నాని’ చిత్రం లో , మహేష్ కి తల్లి గా నటించింది.

అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ లో మోహన్ లాల్ కి సతీమణి గా నటించింది. ఇలా నేటి తరంలో ముగ్గురు సూపర్ స్టార్స్ తో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్న ఆమె , ‘కోర్ట్’ లాంటి గొప్ప మూవీ రీమేక్ ద్వారా తన కూతురుని పరిచయం చేయాలనీ అనుకోవడం మంచి నిర్ణయం. తమిళం లో ‘రంజన్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం రోజున ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. తన కూతురికి ఇంత గొప్ప చిత్రం ద్వారా వెండితెర కి పరిచయం చేయబోతున్నందుకు త్యాగరాజన్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ నిన్నటి ఈవెంట్ లో చెప్పుకొచ్చింది దేవయాని. తన లాగానే కూతురు కూడా ఇండస్ట్రీ లో గొప్పగా రాణిస్తుంది అనే నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చింది దేవయాని.

ప్రియాంక కూడా చూసేందుకు చాలా చక్కగా కనిపిస్తోంది. మోడరన్ దుస్తులు ధరించకుండా, చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ మెచ్చుకుంటున్నారు. క్రింది వీడియో లో దేవయాని తో పాటుగా ఆమె కూతుర్ని కూడా మీరు చూడొచ్చు. అయితే ‘కోర్ట్’ చిత్రం లో హీరోయిన్ వయస్సు చాలా తక్కువగా ఉంటుంది. సినిమా కాన్సెప్ట్ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. కానీ ‘కోర్ట్’ లో హీరోయిన్ శ్రీదేవి తో పోలిస్తే ప్[రియంక వయస్సు లో కాస్త పెద్దదిగా అనిపిస్తుంది. మరి డైరెక్టర్ త్యాగరాజన్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, ఉన్నది ఉన్నట్టుగా తీసినా ఈ సినిమా తమిళంలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper